te_tn_old/act/01/intro.md

6.9 KiB

అపొస్తలుల కార్యములు 01 సాధారణ అంశములు

నిర్మాణము మరియు అంశక్రమము

ఈ అధ్యాయమునందు యేసు తిరిగి సజీవుడైన తరువాత ఆయన పరలోకమునకు తిరిగివెళ్లిన అనగా మనకందరికి తెలిసిన “ఆరోహణము” అనే సన్నివేశమును దాఖలు చేయబడియుంటుంది. ఆయన తన “రెండవ రాకడలో” తిరిగి వచ్చు పర్యంతమువరకు ఆయన తిరిగి రాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు [[rc:///tw/dict/bible/kt/resurrection]])

యుఎస్.టిలో ఇతర ఏ పదాలు కాకుండా “ప్రియమైన తియొఫిలా” అనే పదాలను పొందుపరిచింది. ఇలా ఎందుకంటే ఆంగ్లేయులు అనేకమార్లు ఈ విధముగానే ప్రారంభములో పదాలను ప్రయోగిస్తారు. మీ సంస్కృతిలోని ప్రజలు ఏ విధముగా ఆరంభిస్తారో అలాగే మీరు కూడా ఈ పుస్తకమును ఆరంభించవచ్చును.

కొంతమంది తర్జుమాదారులు మిగిలిన వాక్యభాగములో వ్రాయుటకంటెను వాక్య పేజీలలో కుడి ప్రక్కన కాకుండా పాత నిబంధనలోనుండి కొన్ని వాక్యాలు తీసి క్రోడీకరిస్తారు. దీనిని యుఎల్.టి వారు కీర్తన.1:20 లోని రెండు వాక్యాలను తీసి క్రోడీకరణ చేయడం జరిగింది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు కలవు

బాప్తిస్మము

ఈ అధ్యాయములో “బాప్తిస్మము” అనే పదమునకు రెండు అర్థాలు కలవు. అందులో మొదటిది, యోహాను ఇచ్చు నీటి బాప్తిస్మము సూచిస్తే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము రెండవదిగా సూచిస్తుంది ([అపొ.కార్య.1:5] (../../అపొ.కార్య./01/05.ఎం.డి)). (చూడండి: rc://*/tw/dict/bible/kt/baptize)

“ఆయన దేవుని రాజ్యమును గూర్చి మాట్లాడెను”

యేసు “దేవుని రాజ్యమును గూర్చి మాట్లాడునప్పుడెల్లా” తాను చనిపోకమునుపే దేవుని రాజ్యము ఎందుకు రాదని ఆయన శిష్యులకు వివరిస్తూ ఉండేవాడని కొంతమంది పండితులు నమ్ముతారు. మరికొంతమంది యేసు ఈ భూమి ఉండగానే దేవుని రాజ్యము ఆరంభమౌతుందని మరియు అది ఒక క్రొత్త విధానములో రూపుదిద్దుకొని ఆరంభమవుతుందనే విషయాన్ని ఆయన వివరించేవాడని నమ్ముతారు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట సంగతులు కొన్ని ఉన్నాయి

పన్నెండు మంది అపొస్తలులు

ఈ క్రింద పన్నెండు మంది శిష్యుల పేర్లు పేర్కొనబడియున్నాయి:

మత్తయిలో:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబదయి కుమారుడు యాకోబు, జెబదయి కుమారుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలోతే అనబడిన సీమోను మరియు ఇస్కరియోతు యూద.

మార్కు సువార్తలో:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబదయి కుమారుడు యాకోబు, జెబదయి కుమారుడు యోహాను (వారికి బోయెనేర్గెస్ అనగా ఉరుము కుమారులు అని పేరు), ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలోతే అనబడిన సీమోను, మరియు ఇస్కరియోతు యూద.

లూకా సువార్తలో:

సీమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, సీమోను (జెలోతే అనబడిన వ్యక్తి), యాకోబు కుమారుడు యూద, మరియు ఇస్కరియోతు యూద.

తద్దయి బహుశః యాకోబు కుమారుడు యూద అయ్యుండవచ్చు.

అకెల్దమ

ఈ పదము హెబ్రీ పదమైయుండవచ్చును లేక అరామిక్ పదమైయుండవచ్చును. లూకా గ్రీకు పదాలను ఉపయోగించాడు, తద్వారా చదువరులు దానియందున్న బలమైన అర్థము చేసుకుంటారనే ఆలోచనయైయుండవచ్చును. అంతేగాకుండా, ఆయన ఉపయోగించిన పదాలకు అర్థాలను కూడా చెప్పాడు. మీరు బహుశః మీ భాషలో ఏ విధంగా పలుకుతారో అదేవిధంగా ఉచ్చరించి, దానికున్న అర్థాన్ని వివరించవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)