te_tn_old/3jn/front/intro.md

36 lines
5.0 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# 3 యోహాను పత్రిక పరిచయం
## భాగ1: సాధారణ పరిచయం
### 3 యోహాను పుస్తకం యొక్క గ్రంధవిభజన. పరిచయం (1: 1)
1. ఆతిథ్యాన్ని చూపించడానికి ప్రోత్సాహం మరియు సూచనలు (1: 2-8)
1. దియోత్రెఫే మరియు దేమేత్రి (1: 9-12)
1. ముగింపు (1: 13-14)
### 3 యోహాను పుస్తకాన్ని ఎవరు రాశారు?
ఈ పత్రిక రచయిత పేరు ఇవ్వలేదు. రచయిత తనని తాను “పెద్ద”గా మాత్రమే పరిచయం చేసుకున్నాడు ""(1: 1). ఈ లేఖ బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవిత చరమాంకంలో వ్రాశాడు.
### 3వ యోహాను పత్రిక ఉద్దేశ్యం ఏమిటి?
యోహాను ఈ లేఖను గాయి అనే విశ్వాసికి రాశాడు. తన ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న తోటి విశ్వాసులకు ఆతిథ్యమివ్వాలని అతను గాయికి సూచించాడు.
### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?
అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""3 యోహాను"" లేదా ""మూడవ యోహాను"" అని పిలవడాన్నిఎన్నుకోవచ్చు. లేదా వారు ""యోహాను నుండి మూడవ పత్రిక"" లేదా ""యోహాను వ్రాసిన మూడవ పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
## భాగ2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక భావనలు
### ఆతిథ్యం అంటే ఏమిటి?
పురాతన తూర్పు సమీపంలో ఆతిథ్యం అనేది ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండటం మరియు వారికి అవసరమైతే సహాయం అందించడం చాలా ముఖ్యం. . 2 యోహానులో, అబద్ద బోధకులకు ఆతిథ్యం ఇవ్వకుండా యోహాను క్రైస్తవులను నిరుత్సాహపరిచాడు. 3 యోహానులో, నమ్మకమైన బోధకులలకు ఆతిథ్యం ఇవ్వమని యోహాను క్రైస్తవులను ప్రోత్సహించాడు.
## భాగము 3: ముఖ్యమైన తర్జుమా సమస్యలు
### రచయిత తన లేఖలో కుటుంబ సంబంధాలను ఎలా ఉపయోగించాడు?
రచయిత ఉపయోగించిన ""సోదరుడు"" మరియు ""పిల్లలు"" అనే పదాలు గందరగోళానికి గురిచేసే విధంగా ఉన్నాయి. లేఖనాలు తరచుగా “సహోదరులు” అనే పదాన్ని యూదులను సంభోదిస్తూ ఉపయోగించడం జరిగింది. అయితే ఈ పత్రికలో యోహాను క్రైస్తవులను సంబోధిస్తూ ఉపయోగించాడు. అంతేగాక, కొందరు విశ్వాసులను యోహాను తన “పిల్లలు” అని పిలిచాడు. క్రీస్తుకు విధేయత చూపాలని ఆయన బోధించిన విశ్వాసులు వీరు.
యోహాను ""అన్యజనుడు"" అనే పదాన్నికూడా గందరగోళానికి గురిచేసే విధంగా ఉపయోగించాడు. యూదులు కాని వ్యక్తులను సూచించడానికి లేఖనాలు తరచుగా ""అన్యజనులు"" అనే పదాన్ని ఉపయోగించాయి. కానీ ఈ పత్రికలో, యేసును నమ్మని వారిని సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు.