te_tn_old/2ti/02/intro.md

1.9 KiB

తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు వాక్యాలను మిగిలిన వచనం కంటే పేజిలో కుడి వైపున ఉంచుతాయి. యు.ఎల్.టి(ULT) 11-13 వచనాలలో దీనిని చేస్తుంది. పౌలు ఈ వచనాలలో ఒక కావ్యము లేక ఒక గానమును ఉల్లేఖిస్తూ ఉండవచ్చు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

మనము అతనితో పరిపాలన చేస్తాము

విశ్వాసులైన క్రైస్తవులు రాబోయే కాలములో క్రీస్తుతో పరిపాలన చేస్తారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faithful)

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

సాదృశ్యములు

ఈ అధ్యాయములో, క్రైస్తవుడిగా జీవించడం గురించి బోధించడానికి పౌలు అనేక సాదృశ్యములను చూపించాడు. అతడు సైనికుల, క్రీడాకారుని మరియు వ్యవసాయం చేసేవారి సాదృశ్యమును ఉపయోగిస్తాడు. తరువాతి అధ్యాయములో అతను ఒక ఇంట్లో ఉన్న వివిధ రకాల పాత్రల సాదృశ్యమును ఉపయోగిస్తాడు.