te_tn_old/2th/front/intro.md

9.6 KiB

థెస్సలొనీకయులకు వ్రాసిన 2వ పత్రిక యొక్క పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

2వ థెస్సలొనీకయుల పత్రిక యొక్క విభజన

  1. శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు (1:1-3)
  2. హింసనుండి క్రైస్తవులు శ్రమపడుట
  • వారు దేవుని రాజ్యముకు మరియు ఆయన ఇచ్చిన శ్రమలనుండి విమోచన వాగ్ధానముకు యోగ్యులు (1:4-7)
  • క్రైస్తవులను హింసించు ప్రతియొక్కరికి దేవుడు తీర్పు తీర్చును (1:8-12)
  1. కొంతమంది విశ్వాసులు క్రీస్తు రెండవ రాకడను గూర్చి అపార్థము చేసుకొనియున్నారు
  • క్రీస్తు రాకడ ఇంకా రాలేదు లేక జరగలేదు (2:1-2)
  • క్రీస్తు రాకడకు జరగబోయే సంఘటనల గూర్చిన పరిచయము (2:3-12)
  1. దేవుడు థెస్సలొనీక క్రైస్తవులను రక్షించుననే పౌలు నిశ్చయత
  • “స్థిరముగా ఉండుటకొరకు” అతని పిలుపు (2:13-15)
  • దేవుడు వారిని ఆదరించాలని అతని ప్రార్థన (2:16-17)
  1. థెస్సలొనీక విశ్వాసులను తన కొరకు ప్రార్థన చేయాలని అభ్యర్థిస్తునాడు.(3:1-5)
  2. చలనములేని విశ్వాసులను గూర్చి పౌలు ఇస్తున్న ఆజ్ఞలు (3:6-15)
  3. ముగింపు (3:16-17)

2వ థెస్సలొనీకయుల పుస్తకమును ఎవరు వ్రాశారు?

2వ థెస్సలొనీకయుల పుస్తకమును పౌలు వ్రాశాడు. పౌలు తార్సు పట్టణమునకు చెందినవాడు. పౌలు తన ప్రారంభ జీవితములో సౌలుగా పిలువబడియున్నాడు. క్రైస్తవుడు కాకమునుపు, పౌలు ఒక పరిసయ్యుడైయుండెను. అతను క్రైస్తవులను హింసించియుండెను. అతను క్రైస్తవుడైన తరువాత, అతను యేసును గూర్చి ప్రజలకు బోధించుటకు రోమా సామ్రాజ్యమందంతట అనేకమార్లు ప్రయాణము చేసియుండెను.

పౌలు ఈ పత్రికను కొరింథీ పట్టణములో ఉన్నప్పుడే వ్రాసియుండెను.

2వ థెస్సలొనీక పుస్తకము దేనిని గూర్చి మాట్లాడుచున్నది?

పౌలు ఈ పత్రికను థెస్సలొనీక లో ఉన్నటువంటి విశ్వాసులకు వ్రాసియుండెను. అక్కడున్న విశ్వాసులు హింసను పొందినందున ఆయన వారిని ప్రోత్సహించియుండెను. వారు దేవునిని మెప్పించే విధానములోనే జీవించాలని అతను వారికి చెప్పియుండెను. మరియు ఆయన మరియొకమారు వారికి క్రీస్తు రాకడను గూర్చి బోధించాలనుకున్నాడు.

ఈ పత్రిక పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “2 థెస్సలొనీకయులకు” లేక “రెండవ థెస్సలొనీకయులకు” అనే సంప్రదాయ పేరుతో పిలువవచ్చును. లేదా “థెస్సలొనీకలోని సంఘముకు పౌలు వ్రాసిన రెండవ పత్రిక,” లేక “థెస్సలొనీకలోని క్రైస్తవులకు రెండవ పత్రిక” అనే స్పష్టమైన పేరుతో వారు ఈ పుస్తకమును పిలుచుటకు ఎన్నుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన ప్రాముఖ్య విషయాలు

యేసు “రెండవ రాకడ” అనగానేమిటి?

భూమికి యేసు చివరిసారిగా తిరిగి వచ్చుటనుగూర్చి పౌలు ఈ పత్రికలో ఎక్కువ వ్రాశాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన మనుష్యులందరికి తీర్పు తీర్చును. ఆయన సృష్టియంతటిని పాలించును. మరియు ఆయన అక్కడ ప్రతిచోట సమాధానము కలుగజేయును. క్రీస్తు రాకడకు మునుపు “నాశన పుత్రుడు” వచ్చునని పౌలు వివరించియున్నాడు. ఈ వ్యక్తి సాతానుకు లోబడుతాడు మరియు అనేకమంది ప్రజలు దేవునిని తిరస్కరించునట్లు చేయును. అయితే యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఈ వ్యక్తిని నాశనము చేయును.

భాగము 3: తర్జుమాపరమైన కీలక అంశాలు

పౌలు ఉపయోగించిన “క్రీస్తులో,” “ప్రభువునందు,” మొదలగు మాటలకు అర్థము ఏమిటి?

క్రీస్తు మరియు విశ్వాసులు అన్యోన్య సహవాసమును కలిగియుందురని వ్యక్తము చేయుటకు పౌలు ఈ మాటలను ఉపయోగించియున్నాడు. ఇటువంటి మాటలను గూర్చిన ఎక్కువ వివరములకు రోమా పత్రిక యొక్క పరిచయమును దయచేసి చూడండి.

2వ థెస్సలొనీక పుస్తకములోనున్న వాక్యములో కీలక విషయములు ఏమిటి?క్రిందనున్న వచనములవరకు, బైబిలుపరమైన ఆధునిక అనువాదములకు పాత అనువాదములకు వ్యత్యాసముండును. యుఎల్.టి వాక్యములో ఆధునిక తర్జుమా ఉంటుంది మరియు పాత అనువాదమును పేజి క్రింద భాగములో పెట్టియుందురు. స్థానిక ప్రాంతములో బైబిలును తర్జుమా చేసినట్లయితే, తర్జుమాదారులు ఆ అనువాదములనే ఉపయోగించుకొనవలెను. ఒకవేళ స్థానిక భాషలో తర్జుమా లేకపోయినట్లయితే, తర్జుమాదారులు ఆధునిక తర్జుమాలనే ఉపయోగించకొనవలెను.

  • “నాశన పుత్రుడు బయలుపరచబడును” (2:3). యుఎల్.టి, యుఎస్.టి మరియు ఆధునిక తర్జుమాలు ఎక్కువ శాతము ఇలాగే తర్జుమా చేసియుందురు. పాత తర్జుమాలలో “పాప పుత్రుడు బయలుపరచబడును” అని వ్రాసియుందురు.
  • ‘రక్షణ కొరకు దేవుడు మిమ్మును తోలిపంటగా ఎంచుకొనియున్నాడు” (2:13) అని కొన్ని యుఎల్.టి, యుఎస్.టి మరియు ఆధునిక తర్జుమాలు ఎక్కువ శాతము ఇలాగే తర్జుమా చేసియుందురు. పాత తర్జుమాలలో, “రక్షణ కొరకు దేవుడు మిమ్మును మొదటిగా ఎంచుకొనియున్నాడు”

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)