te_tn_old/2th/01/intro.md

2.4 KiB

2 థెస్సలొనీకయులకు 01 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

1-2 వచనాలు అధికారికంగా ఈ పత్రికను పరిచయము చేయును. పూర్వ కాలములో తూర్పు ప్రాంతాలవైపు ఈ పత్రికలను సాధారణముగా ఈ విధమైన పరిచయముతో ఆరంభించి వ్రాసేవారు.

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర కీలక విషయాలు

అసంబంధము

అసాధ్యమైనవాటిని వివరించుటకు కనిపించే నిజమైన వ్యాఖ్యయే అసంబంధము అని చెప్పవచ్చు. అసంబంధమైన వ్యాఖ్యాలు 4-5 వచనములలో కనిపిస్తాయి: “మీ హింసలన్నిటిలో మీరు కలిగియున్న విశ్వాసము మరియు సహనమునుగూర్చి మేము మాట్లాడుకొనుచున్నాము. మీరు సహించిన యాతనలనుగూర్చి మేము మాట్లాడుకొనుచున్నాము. దేవుని నీతియుతమైన తీర్పుకు ఇది చిహ్నమైయున్నది.” హింస కాల సమయములో దేవునియందు విశ్వసించుటయనునది దేవుని నీతియుతమైన తీర్పుకు చిహ్నమైయున్నదని ప్రజలు సాధారణముగా ఆలోచించరు. అయితే 5-10 వచనాలలో దేవునియందు విశ్వసించినవారికి ఆయన వారికి ఎలా బహుమానములు ఇచ్చునని మరియు వారిని ఎదిరించినవారికి ఆయన ఎలా తీర్పు తీర్చును అనే విషయాలను పౌలు వివరించుచున్నాడు. ([2 Thessalonians .1:4-5] (./04.md))