te_tn_old/2pe/01/intro.md

3.7 KiB
Raw Permalink Blame History

2 పేతురు 01 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

పేతురు అధికారికంగా 1-2 వచనాలలో ఈ పత్రికను పరిచయం చేశాడు. పురాతన సమీప తూర్పు ప్రాంత రచయితలు తరచూ ఈ విధంగా ఉత్తరాలను ప్రారంభించేవారు.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

దేవుని జ్ఞానం

దేవుని జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయనకు చెంది ఉండుట లేదా ఆయనతో సంబంధం కలిగి ఉండుట. ఇక్కడ, ""జ్ఞానం"" అనేది దేవుని గురించి కేవలం మానసికంగా తెలుసుకోవడం కంటే ఎక్కువైనది. ఇది దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి మరియు అతనికి కృపను మరియు శాంతిని ఇవ్వడానికి కారణమయ్యే జ్ఞానం. (చూడండి:rc://*/tw/dict/bible/other/know)

దైవిక జీవితాలను గడపడం

దైవభక్తి గల జీవితాలను గడపడానికి దేవుడు విశ్వాసులకు అవసరమైనవన్నీ ఇచ్చాడని పేతురు బోధిస్తున్నాడు. అందువల్ల, విశ్వాసులు దేవునికి మరింత విధేయత చూపునట్లుగా వారు చేయగలిగినదంతా చేయాలి. విశ్వాసులు దీన్ని కొనసాగిస్తే, వారు యేసుతో ఉన్న సధo ద్వారా సమర్థవంతంగా మరియు ఫలవంతంగా ఉంటారు. ఏదేమైనప్పటికీనీ, విశ్వాసులు దైవిక జీవితాలను జీవించుట కొనసాగించకపోతే, వారిని రక్షించడానికి దేవుడు క్రీస్తు ద్వారా ఏమి చేసాడో వారు మరచిపోయినట్లే. (చూడండి:[[rc:///tw/dict/bible/kt/godly]] మరియు [[rc:///tw/dict/bible/kt/save]])

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

లేఖనం యొక్క సత్యం

లేఖనంలోని ప్రవచనాలు మనుషుల వలన కలుగలేదని బోధిస్తున్నాడు. ఎవరైతే వాటిని చెప్పారో లేదా వ్రాశారో ఆ మనుష్యులకు పరిశుద్ధాత్మదేవుడు దేవుని సందేశాన్ని బయల్పరిచాడు. అలాగే, పేతురు మరియు ఇతర అపొస్తలులు యేసు గురించి ప్రజలకు చెప్పినప్పుడు కథలను రూపొదిoచి చెప్పలేదు. వారు యేసు చేసినదానికి సాక్ష్యమిచ్చారు మరియు దేవుడు యేసును తన కుమారుడు అని పిలవడం వారు విన్నారు.