te_tn_old/2jn/front/intro.md

5.0 KiB
Raw Permalink Blame History

2 యోహాను పరిచయం

భాగం 1: సాధారణ పరిచయం

2 యోహాను

1 పుస్తకం యొక్క గ్రంధ విభజన. శుభాకాంక్షలు(1: 1-3)

  1. ప్రోత్సాహం మరియు గొప్ప ఆజ్ఞ (1: 4-6)
  2. తప్పుడు బోధకుల గురించి హెచ్చరిక (1: 711)
  3. తోటి విశ్వాసుల నుండి శుభాకాంక్షలు (1: 12-13)

2 యోహాను పుస్తకాన్ని ఎవరు రాశారు?

లేఖలో రచయిత పేరు లేదు. రచయిత తనను తాను ""పెద్ద"" అని మాత్రమే పరిచయం చేసుకున్నాడు. ఈ లేఖ బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవిత చరమాంకంలో వ్రాసి ఉంటాడు.2 యోహాను పత్రిక యొక్క విషయాలు యోహాను సువార్తలోని విషయాలతో సమానంగా ఉంటాయి.

2 యోహాను పత్రిక దేని గురించి వ్రాయబడింది?

యోహాను ఈ లేఖను ""ఎన్నికైన తల్లికి"" మరియు ""ఆమె పిల్లలకు"" ( 1: 1) వ్రాస్తున్నాడు. ఇది నిర్దిష్ట స్నేహితుడిని మరియు ఆమె పిల్లలను సూచిస్తుంది. లేదా ఇది ఒక నిర్దిష్ట విశ్వాసుల సమూహాన్ని లేదా సాధారణంగా విశ్వాసులను సూచిస్తుంది. ఈ లేఖ రాయడంలో యోహానుయొక్క ఉద్దేశ్యం అబద్ద బోధకుల గురించి తన ప్రేక్షకులను హెచ్చరించడమే. తప్పుడు బోధకులకు విశ్వాసులు సహాయం చేయడం లేదా డబ్బు ఇవ్వడం యోహాను కోరలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""2 యోహాను"" లేదా ""రెండవ యోహాను"" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు ""యోహాను నుండి రెండవ పత్రిక"" లేదా ""యోహాను వ్రాసిన రెండవ పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

ఆతిథ్యం అంటే ఏమిటి?

పురాతన సమీప తూర్పు ప్రాంతంలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండటం మరియు వారికి అవసరమైతే సహాయం అందించడం చాలా ముఖ్యం. విశ్వాసులు అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలని యోహాను కోరుకున్నాడు. అయినప్పటికీ, విశ్వాసులు అబద్ద బోధకులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని అతను ఇష్టపడలేదు.

యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు బహుశా గ్నోస్తికులు (జ్ఞానం కలిగిన) అని పిలవబడే వారు కావచ్చును. ఈ ప్రజలు భౌతిక ప్రపంచం చెడ్డది అని నమ్మేవారు. యేసు దైవమని వారు విశ్వసించినందున, ఆయన నిజంగా మానవుడనే విషయాన్ని వారు ఖండించారు. భౌతిక శరీరం చెడ్డది కాబట్టి దేవుడు శరీర ధారి కాదని వారు భావించడం దీనికి కారణం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/evil)