te_tn_old/2co/front/intro.md

16 KiB
Raw Permalink Blame History

కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికయొక్క విభజన

  1. కొరింథీలో ఉన్న క్రైస్తవుల కొరకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చేయుచున్నాడు (1:1-11)
  2. పౌలు తన ప్రవర్తనను మరియు తన పరిచర్యను వివరించాడు (1:12-7:16)
  3. పౌలు యేరుషలేము దేవాలయమునకు ధనమును సమకుర్చుటను గురించి చెప్పుచున్నాడు. (8:1-9:15)
  4. పౌలు అపోస్తలుడుగా తన అధికారాన్ని కాపాడుకుంటున్నాడు.(10:1-13:10)
  5. పౌలు చివరి అభినందన మరియు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు (13:11-14)

కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు ఈ పత్రిక యొక్క రచయిత. అతను తార్సు పట్టణానికి చెందినవాడు. అతడు తన ప్రారంభ జీవితంలో సౌలు అని పిలువబడ్డాడు. అతడు క్రైస్తవులను హింసించాడు. పౌలు క్రైస్తవుడిగా మారటానికి ముందు, ఒక పరిసయ్యుడుగా ఉండేవాడు. క్రైస్తవుడిగా మారిన తరువాత, అతడు యేసుని గురించి ప్రజలకు ప్రకటిస్తూ రోమీయుల సామ్రాజ్యమంతట చాల సార్లు ప్రయాణము చేసాడు.

పౌలు కో కొరింథులో సంఘాన్ని ప్రారంభించాడు. అతను ఈ పత్రికను వ్రాసినప్పుడు ఎఫెసు పట్టణములో ఉన్నాడు.

కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక దేనిని గురించి వివరించుచున్నది?

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో కొరింథు పట్టణములోని క్రైస్తవుల మధ్య విభేదాల గురించి పౌలు వ్రాస్తూనే ఉన్నాడు. కొరింథీయులు అతని మునుపటి సూచనలను పాటించారని ఈ పత్రికలో స్పష్టమైంది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో, దేవుడిని సంతోష పెట్టే విధంగా జీవించమని పౌలు వారిని ప్రోత్సహించాడు.

సువార్త ప్రకటించడానికి యేసు క్రీస్తు తనను అపోస్తలుడిగా పంపించాడని పౌలు వారిని నమ్మించాడు. వారు దీనిని అర్థం చేసుకోవాలని పౌలు కోరుకున్నాడు, ఎందుకంటే యూద క్రైస్తవుల బృందం అతను చేస్తున్న పనిని వ్యతిరేకించారు. పౌలు దేవుని చేత పంపబడలేదనియు మరియు అతను ఒక తప్పుడు బోధను బోధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ యూద క్రైస్తవుల బృందం అన్యదేశములోని క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రమును పాటించాలని కోరుకున్నారు.

ఈ పత్రిక యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాచేయువారు ఈ పత్రికను “కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేక “కొరింథులో ఉన్న సంఘమునకు పౌలు వ్రాసిన 2వ పత్రిక” వంటి స్పష్టమైన పేరును ఎంచుకోవచ్చు.” (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు

\nకొరిథు పట్టణము ఎలా ఉండేది?

కొ రింథు పట్టణము ప్రాచీనమైన గ్రీసు దేశములోని ఒక ప్రధాన పట్టణమైయున్నది. ఇది మధ్యధర సముద్రము దగ్గర ఉన్నందున చాలా మంది ప్రయాణికులు మరియు వర్తకులు అక్కడ వస్తువులను కొనడానికి మరియు విక్రయించడానికి వచ్చేవారు. దీని ఫలితంగా పట్టణములో అనేక సంస్కృతుల ప్రజలు ఉన్నారు. అనైతిక మార్గాలలో నివసించే ప్రజలను కలిగి ఉండటానికి ఈ పట్టణం ప్రసిద్ది చెందింది. గ్రీకు ప్రేమ దేవత అయిన ఆఫ్రోడైటను ప్రజలు ఆరాధించేవారు. ఆఫ్రోడైటను గౌరవించే ఆచారంలో భాగంగా, ఆమె ఆరాధకులు ఆలయ వేశ్యలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారు.

“తప్పుడు అపోస్తలలు” అనగా ఏమని పౌలు చెప్పుచున్నాడు (11:13)?

వీరు యూద క్రైస్తవులు. క్రీస్తును అనుసరించడానికి అన్యదేశస్తులైన క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని వారు బోధించారు. క్రైస్తవ నాయకులు యెరుషలేములో సమావేశమై ఈ విషయం పై నిర్ణయం తీసుకున్నారు (చూడండి: అపోస్తలుల కార్యములు 15). ఏదేమైనా, యెరుషలేములో నాయకులు నిర్ణయించిన దానితో విభేదించే కొన్ని సమూహాలు ఇంకా ఉన్నాయని స్పష్టమైంది.

భాగము 3: ముఖ్యమైన తర్జుమా విషయాలు

ఏకవచనం మరియు బహువచనం “మీరు”

ఈ పత్రికలో, “నేను” అనే పదం పౌలును గురించి చెప్పబడింది. ఇక్కడ “నీవు” అనే పదం దాదాపుగా ఏకవచనమైయున్నది మరియు ఇది కొరింథులోని విశ్వాసులను గురించి తెలియచేస్తుంది. దీనికి రెండు మినహాయింపులు కలవు: 6:2 మరియు 12:9. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

యు.ఎల్.టి (ULT) లోని 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో “పవిత్రం” మరియు “పరిశుద్ధపరచుట” అనే ఆలోచనలు ఎలా చెప్పబడుచున్నాయి?

వివిధ ఆలోచనలలో దేనినైన సూచించుటకు లేఖనాలు అలాంటి పదాలను ఉపయోగిస్తాయి. ఈ కారణంగా తర్జుమా చేయువారు వారి అనువాదంలో వాటిని బాగా తర్జుమా చేయడం చాల కష్టం అని చెప్పబడింది. ఆంగ్లలోకి తర్జుమా చేయడంలో యు.ఎల్.టి (ULT) ఈ క్రింది సూత్రాలను ఉపయోగిస్తుంది:

  • కొన్ని సార్లు ఒక వాక్య భాగంలోని అర్థం నైతిక పవిత్రతను గురించి తెలియచేస్తుంది. విశేషముగా క్రైస్తవులు యేసు క్రీస్తుతో ఐక్యమైనందున దేవుడు క్రైస్తవులను పాపము చేయనివారిగా ఎంచటం సువార్తను అర్థం చేసుకోవడానికి చాల ముఖ్యమైనది. మరియొక సంబంధిత వాస్తవం ఏమిటంటే దేవుడు పరిపూర్ణుడు మరియు నిర్దోషియై యున్నాడు. మూడవ వాస్తవం ఏమిటంటే క్రైస్తవులు తమ జీవితంలో తమను తాము నిర్దోషులుగా, నిరపరాధులుగా వ్యవహరించాలి. ఈ సందర్భాలలో యు.ఎల్.టి (ULT) “పరిశుద్ధత” “పరిశుద్ధ దేవుడు” “పరిశుద్ధులు” లేక “పరిశుద్ద ప్రజలను” అనే పదాలను ఉపయోగిస్తుంది.

  • 2వ కొరింథియులకు వ్రాసిన పత్రికలోని వాక్య భాగంలోని అర్థం ఎమిటంటే క్రైస్తవులు నింపిన ప్రత్యేక పాత్రను సూచించకుండా ఒక సాధారణ సంబంధం కలిగి ఉన్నారని చెప్పబడింది. ఈ సందర్భాలలో యు.ఎల్.టి (ULT) “విశ్వాసి” లేక “విశ్వాసులు” అనే పదాలను ఉపయోగిస్తుంది. (చూడండి: 1:1; 8:4; 9:1, 12; 13:13)

  • కొన్నిసార్లు వాక్యభాగాములోని అర్థం ఎవరికైనా లేక దేవుని కోసం మాత్రమే వేరుగా ఉంచబడిన ఆలోచనను సూచిస్తుంది.\nఈ సందర్భాలలో, యు.ఎల్.టి (ULT) “వేరుచేయబడుట,” అంకితం చేయబడుట,” “ప్రత్యేకం చేయబడుట” లేక “పరిశుద్ధపరచబడుట.” అనే పదాలను ఉపయోగిస్తుంది.

తర్జుమా చేయువారు తమ స్వంత తర్జుమాలలో ఈ ఆలోచనలను ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నందున యు.ఎస్.టి (UST) తరచుగా సహాయపడుతుంది.

“క్రీస్తులో” మరియు “ప్రభువులో” అనే వాక్కుల అర్థం ఏమిటని పౌలు చెప్పుచున్నాడు?

ఈ రకమైన వాక్కులు 1:19, 20; 2:12, 17; 3:14; 5:17, 19, 21; 10:17; 12:2, 19; మరియు 13:4 అధ్యాయాలు కలిగియున్నవి. పౌలు క్రీస్తుతో మరియు విశ్వాసులతో ఐకమత్యముగా ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించి చెప్పాడు. అదే సమయములో, అతడు తరచుగా ఇతర అర్థాలను కూడా ఉద్దేశించి చెప్పాడు. ఉదాహరణకు “ప్రభువులో నా కోసం ఒక ద్వారం తెరువబడింది” (2:12)ఇక్కడ పౌలు చెప్పే మాటలకు అర్థం ప్రత్యేకంగా పౌలుకు ప్రభువు చేత ఒక ద్వారము తెరువబడిందని చెప్పుచున్నాడు.

ఈ రకమైన వాక్కుల గురించి మరిన్ని వివరాల కోసం రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క పరిచయమును చూడండి.

క్రీస్తులో “క్రొత్త సృష్టి” (5:17) అనే మాటకు అర్థం ఏమిటి?

ఒక వ్యక్తీ క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు క్రైస్తవులను “క్రొత్త ప్రపంచం”లో భాగం చేస్తాడని పౌలు సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడు పరిశుద్ధత, సమాధానము మరియు ఆనందం యొక్క క్రొత్త ప్రపంచాన్ని ఇస్తాడు. ఈ క్రొత్త ప్రపంచంలో విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన క్రొత్త స్వభావం ఉంటుంది. తర్జుమా చేయువారు ఈ ఆలోచనను వ్యక్తపరచడానికి ప్రయత్నించాలి.

2వ కొరింథియులకు వ్రాసిన పత్రికలోని కీలక విషయాలు ఏమిటి?

  • “మరియు మీకు మా పట్ల ఉన్న ప్రేమలో” (8:7). యు.ఎల్.టి (ULT) మరియు యు.ఎస్.టి (UST) తో సహా చాలా తర్జుమాలు ఈ విధంగా చదవబడతాయి. అయినప్పటికీ, అనేక ఇతర తర్జుమాలు “మరియు మీ పట్ల మా ప్రేమలో” అని చదవబడ్డాయి. ప్రతి వాక్య భాగము నిజమైనదని బలమైన ఆధారాలు కలవు. తర్జుమా చయువారు తమ ప్రాంతంలోని ఇతర తర్జుమాలు ఇష్టపడే వాక్యాన్ని అనుసరించాలి.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)