te_tn_old/2co/11/intro.md

8.3 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్థించుకుంటూనే ఉన్నాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

తప్పుడు బోధలు

కొరింథీయులు తప్పుడు బోధను అంగీకరించారు. వారు యేసు గురించి మరియు సువార్త గురించి భిన్నమైన మరియు నిజం కాని విషయాలను బోధించారు. ఈ తప్పుడు బోధకులుగా కాకుండా పౌలు బలియజ్ఞంగా కొరింథీయులకు సేవ చేసాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/goodnews)

వెలుగు

వెలుగుని క్రొత్త ఒడంబడికలో ఒక రూపకఅలంకారమువలే ఉపయోగిస్తారు. దేవుని వెల్లడిపరచడం మరియు నీతిని సూచించడానికి పౌలు ఇక్కడ వెలుగును ఉపయోగిస్తాడు. చీకటి పాపం గురించి వివరిస్తుంది. పాపం దేవుని నుండి దాగుకొనుటకు ప్రయత్నిస్తుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/other/light]], [[rc:///tw/dict/bible/kt/righteous]] మరియు [[rc:///tw/dict/bible/other/darkness]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారము

పౌలు ఈ అధ్యాయాన్ని విస్తరించిన రూపకఅలంకారముతో ప్రారంభిస్తాడు. అతడు తన పెళ్ళికొడుకుకు పవిత్రమైన, కన్య వధువును ఇస్తున్న వధువు తండ్రితో పోల్చాడు. సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి వివాహ పద్దతులు మారతాయి. కాని ఒకరిని ఎదిగిన మరియు పవిత్రమైన బిడ్డగా చూపించడానికి సహాయం చేయాలనే ఆలోచన వాక్య భాగంలో స్పష్టంగా ప్రతిపాదించబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/holy]] మరియు rc://*/ta/man/translate/figs-explicit)

వ్యంగ్యము

ఈ అధ్యాయము వ్యంగ్యంతో నిండి ఉంది. కొరింథులో ఉన్న విశ్వాసులు తన వ్యంగ్యంతో సిగ్గు పడాలని పౌలు ఆశిస్తున్నాడు.

”మీరు ఈ విషయాలను బాగా సహిస్తారు!” “తప్పుడు అపోస్తలులు తమతో ప్రవర్తించిన తీరును వారు సహించకూడదని పౌలు భావిస్తాడు. వారు నిజంగా అపోస్తలుడని పౌలు అనుకోడు.

“మీ కోసం ముర్ఖులతో సంతోషంగా ఉండండి” కోరింథులోని విశ్వాసులు తమను తాము చాలా తెలివైనవారని అనుకుంటారు కాని పౌలు అంగీకరించలేదు అని వివరించబడింది.

”మేము చాలా బలహీనంగా ఉన్నామని చెప్పుటకు సిగ్గుపడుతున్నాము.” పౌలు దానిని నివారించడానికి చాలా తప్పు అని భావించే ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు. అతను అది చేయకపోవడం తప్పు అని అనుకున్నట్లు మాట్లాడుతున్నాడు. అతను ఒక అలంకారిక ప్రశ్నను వ్యంగ్యంగా ఉపయోగిస్తాడు. “మీరు ఘనముగా ఉండటానికి నాకు నేను వినయముగా ఉండటం ద్వారా పాపం చేశానా?” (చూడండి: [[rc:///ta/man/translate/figs-irony]] మరియు [[rc:///tw/dict/bible/kt/apostle]] మరియు rc://*/ta/man/translate/figs-rquestion)

అలంకారిక ప్రశ్నలు

ఉన్నతమైనదని చెప్పుకునే తప్పుడు అపోస్తలులను ఖండించడంలో, పౌలు అలంకారిక ప్రశ్నల వరసను ఉపయోగిస్తాడు. ప్రతి ప్రశ్న సమాధానంతో జతచేయబడుతుంది: “వారు హేబ్రియులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు అబ్రాహాము వారసులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు క్రీస్తు సేవకులేనా? (నేను వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) అలా నేను ఎక్కువగా ఉన్నాను.”

అతను తన మతమార్పిడులతో సహానుభూతి పొందడానికి అలంకారిక ప్రశ్నల వరుసను కూడా ఉపయోగిస్తాడు: “ఎవరు బలహీనంగా ఉన్నారు మరియు నేను బలహీనంగా లేనా? మరొకరు పాపంలో పడటానికి ఎవరు కారణమైయ్యారు, నేను లోపల కాలిపోనా?”

“వారు క్రీస్తు సేవకులా?”

ఇది ఒక వ్యంగ్యంపు మాటలై యున్నవి, ఎగతాళి చేయడానికి లేక అవమానించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన వ్యంగ్యంగా ఉంది. ఈ తప్పుడు బోధకులు వాస్తవానికి క్రీస్తును సేవిస్తారని పౌలు నమ్మడు, వారు అలా నటిస్తారు

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

వైపరీత్యం

“వైపరీత్యం” అనేది అసాధ్యమైనదాన్ని వివరించడానికి కనిపించే నిజమైన వివరణయై యున్నది. 30వ వచనములో ఈ వాక్యం ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నేను గొప్పలు చెప్పాలంటే, నా బలహీనతలను చూపించే దాని గురించి నేను గొప్పలు చెపుతాను. 2వ కొరింథీయులకు 12:9 వరకు తన బలహీనత గురించి ఎందుకు గొప్పలు చెపుతాడో పౌలు వివరించలేదు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:30)