te_tn_old/2co/07/intro.md

3.0 KiB
Raw Permalink Blame History

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 07 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

2-4 వచనాలలో, పౌలు తన సమర్థనను ముగించాడు. అప్పుడు అతడు తీతు తిరిగి రావడం గురించి మరియు అతడు తిరిగి వచ్చినందున కలిగిన ఆదరణ గురించి వ్రాస్తాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

పవిత్రత మరియు అపవిత్రత

దేవుడు పాపమునుండి వారిని పవిత్ర పరిచాడు అంటే క్రైస్తవులు “పవిత్రంగా” ఉన్నారు అని దీని అర్థం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రంగా ఉండటానికి వారు విచారించాల్సిన అవసరం లేదు. భక్తీహినమైన జీవితం ఇప్పటికీ క్రైస్తవుడిని అపవిత్రం చేస్తుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/clean]] మరియు [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

బాధ మరియు విచారం

ఈ అధ్యాయములోని “విచారకరమైన” మరియు “బాధకరమైన” అనే పదాలు కొరింథీయులు పశ్చాత్తాపం చెందడానికి కలత చెందారని సూచిస్తున్నాయి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/repent)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

మేము

పౌలు తిమోతి మరియు తనను సూచించడానికి “మేము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు. \nఇదులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.

అసలు పరిస్థితి

ఈ అధ్యాయము మునుపటి పరిస్థితిని వివరంగా చర్చిస్తుంది. ఈ అధ్యాయములోని వర్తమానము నుండి ఈ పరిస్థితి యొక్క కొన్ని అంశాలను మనం గుర్తించవచ్చు. కాని ఈ రకమైన అస్పష్ట వర్తమానాన్ని అనువాదంలో చేర్చకపోవడమే మంచిది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)