te_tn_old/2co/05/intro.md

3.9 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 05 అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

పరలోకములో క్రొత్త దేహాలు

పౌలు చనిపోయినప్పుడు చాల మంచి దేహాన్ని పొందుతాడని అతనికి తెలుసు. ఈ కారణంగా, సువార్త ప్రకటించినందుకు చంపబడతాడని భయపడడు. కాబట్టి ఇతరులను కూడా దేవునితో రాజీ పడవచ్చని ఆయన చెబుతాడు. క్రీస్తు వారి పాపములను తీసివేసి తన నీతిని వారికి ఇస్తాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/goodnews]], [[rc:///tw/dict/bible/kt/reconcile]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/righteous]])

క్రొత్త సృష్టి

పాత మరియు క్రొత్త సృష్టి బహుశః పాత మరియు క్రొత్త స్వభావాన్ని పౌలు ఎలా వివరించాడనే దాన్ని గురించి తెలియచేస్తుంది. ఈ అభిప్రాయాలు పాత మరియు క్రొత్త మనిషికి సమానంగా ఉంటాయి. “పాత” అనే పదం బహుశా ఒక వ్యక్తి జన్మించిన పాపపు స్వభావం గురించి తెలియచేయదు. ఇది పాత జీవన విధానాన్ని లేక క్రైస్తవుడు పూర్వమందు పాపానికి కట్టుబడి ఉన్నాడని తెలియపరుస్తుంది. “క్రొత్త సృష్టి” అనగా క్రీస్తును విశ్వసించిన తరువాత దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే క్రొత్త స్వభావం లేక క్రొత్త జీవితమైయున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

నివాసము

క్రైస్తవుని నివాసము భూలోకములో లేదు. ఒక క్రైస్తవుని నిజమైన నివాసము పరలోకములో ఉంది. ఈ రూపకఅలంకారాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ లోకములో క్రైస్తవుడి పరిస్థితులు తాత్కాలికమని పౌలు నొక్కి చెప్పాడు. ఇది బాధపడేవారికి నిరీక్షణను ఇస్తుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు rc://*/tw/dict/bible/kt/hope)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

“సమాధాన సందేశము”

ఇది సువార్తను గురించి తెలియచేస్తుంది. దేవునికి విరోధులైన ప్రజలు పశ్చాత్తాపపడి తనతో సమాధానపడాలని పౌలు పిలుపునిచ్చాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/repent)