te_tn_old/2co/04/intro.md

3.7 KiB

2వ కోరింథీయులకు వ్రాసిన పత్రిక 04 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయము “కాబట్టి” అనే పదంతో ప్రారంభమవుతుంది. ఇది మునుపటి అధ్యాయము బోధించిన వాటితో చేర్చబడింది. ఈ అధ్యాయాలు ఎలా విభజించబడ్డాయి అనేది చదవరులకు గందరగోళంగా ఉంటుంది.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

పరిచర్య

పౌలు క్రీస్తు గురించి చెప్పడం ద్వారా పరిచర్య చేస్తాడు. అతను ప్రజలను నమ్మించడానికి మోసము చేయడానికి ప్రయత్నించడు. సమస్య తుదకు అధ్యాత్మికమైనందున వారు సువార్తను అర్థం చేసుకోకపొతారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/spirit)

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

వెలుగు మరియు చీకటి

పరిశుద్ధ గ్రంథము అనీతిమంతులైన వ్యక్తుల గురించి చెప్పుచున్నది, చీకటిలో తిరుగుతున్నవారు దేవునికి నచ్చినది చేయని వ్యక్తులని వ్రాయబడింది. ఆ పాపపు ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి, ఏతప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడానికి వీలు కల్పిస్తుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

జీవము మరియు మరణము

పౌలు ఇక్కడ శారీరిక జీవము మరియు మరణం గురించి తెలియచేయుటలేదు. ఒక క్రైస్తవుడు యేసులో కలిగియున్న క్రొత్త జీవితాన్ని ఈ జీవము సూచిస్తుంది. మరణం అనేది యేసును విశ్వసించే ముందు పాత జీవన విధానాన్ని సూచిస్తుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/life]] మరియు [[rc:///tw/dict/bible/other/death]] మరియు rc://*/tw/dict/bible/kt/faith)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

ఆశ

పౌలు పదే పదే మాదిరిని ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగిస్తాడు. అతను వివరించాడు. అప్పుడు అతను వ్యతిరేకమైన లేక విరుద్ధమైన వివరణను ఖండించాడు లేక మినహయింపు ఇస్తాడు. \nఇవన్ని కలసి క్లిష్ట పరిస్తితులలో చదవరులకు ఆశను ఇస్తాయి (చూడండి: rc://*/tw/dict/bible/kt/hope)