te_tn_old/1ti/front/intro.md

8.7 KiB

తిమోతికి వ్రాసిన మొదటి పత్రికకు పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

1 తిమోతి పత్రిక యొక్క విభజన

  1. శుభములు (1:1,2)
  2. పౌలు మరియు తిమోతి -తప్పుడు బోధకులను గూర్చి హెచ్చరిక(1:3-11)
  • క్రీస్తు పౌలు పరిచర్యలో చేసిన కార్యములను బట్టి పౌలు కృతజ్ఞతలు తెలుపుచున్నాడు (1:12-17)
  • ఈ ఆత్మీయ యుద్ధములో తిమోతి పోరాటము చేయాలని పౌలు పిలుచుచున్నాడు (1:18-20)
  1. అందరికొరకు ప్రార్థన (2:1-8)
  2. సంఘములో పాత్రలు మరియు బాధ్యతలు (2:9-6:2)
  3. హెచ్చరికలు
  • తప్పుడు బోధకులను గూర్చి రెండవ హెచ్చరిక (6:3-5)
  • డబ్బు లేక ధనము (6:6-10)
  1. దైవజనుడిని గూర్చిన వివరణ (6:11-16)
  2. సంపన్న ప్రజలను గమనించండి (6:17-19)
  3. తిమోతికి చివరి మాటలు (6:20,21)

1 తిమోతి పత్రికను ఎవరు వ్రాశారు?

1 తిమోతి పత్రికను పౌలు వ్రాశాడు. పౌలు తార్సు పట్టణముకు చెందినవాడు. పౌలు తన జీవిత ప్రారంభ దశలో సౌలుగా పిలువబడియున్నాడు. పౌలు క్రైస్తవుడు కాకమునుపు అతను ఒక పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించియుండెను. అతను క్రైస్తవుడైన తరువాత, యేసును గూర్చి ప్రజలకు బోధించుటకు రోమా సామ్రాజ్యమందంతట అతను అనేకమార్లు పర్యటించియుండెను.

ఈ పుస్తకము పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికయైయుండెను. తిమోతి తన శిష్యుడు మరియు సన్నిహిత స్నేహితుడైయుండెను. పౌలు ఈ పత్రికను తన జీవిత చివరి దశలో వ్రాసియుండియుండవచ్చును.

1 తిమోతి పత్రికయంత దేనిని గూర్చి వ్రాయబడియున్నది?

ఎఫెసీలోని విశ్వాసులకు సహాయము చేయుటకు పౌలు తిమోతిని ఆ ఎఫెసీ పట్టణములోనే వదిలి వెళ్ళాడు. అనేక విషయములను గూర్చి బోధించుటకు పౌలు తిమోతికి ఈ పత్రికను వ్రాసియుండెను. ఆయన వ్రాసిన విషయములలో సంఘ ఆరాధన, సంఘ నాయకులుగా ఉండుటకు అర్హతలు, మరియు తప్పుడు బోధకులను గూర్చిన హెచ్చరికలను వ్రాసియుండెను. సంఘముల మధ్యన నాయకుడిగా ఎలా ఉండాలనేదానిని గూర్చి పౌలు తిమోతిని తర్ఫీదు చేయుటను ఈ పత్రిక చూపించుచున్నది.

ఈ పుస్తకపు పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “1 తిమోతి” లేక “మొదటి తిమోతి” అని సంప్రదాయ పేరుతొ ఈ పుస్తకమును ఎన్నుకోవచ్చు. లేదా వారు “పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక” అనే స్పష్టమైన పేరును ఎన్నుకోవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన ప్రాముఖ్య విషయాలు

శిష్యత్వము అనగానేమి?

ప్రజలను క్రీస్తు శిష్యులనుగా చేయు విధానమునే శిష్యత్వము అని పిలుతురు. శిష్యత్వపు గురి ఏమనగా ఇతర క్రైస్తవులను క్రీస్తువలె మార్చుటకు చేయు ప్రోత్సాహమే. తక్కువ అవగాహన కలిగిన ఒక క్రైస్తవుడిని నాయకునిగా ఎలా తయారు చేయాలనేదానిని గూర్చి ఈ పత్రిక అనేక విషయాలను తెలియజేస్తుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/disciple)

భాగము 3: తర్జుమాపరమైన ప్రాముఖ్య విషయాలు

ఏకవచనము మరియు బహువచనము “మీరు”

ఈ పుస్తకములో “నేను” అనే పదము పౌలును సూచిస్తుంది. “నువ్వు” అనే పదము ఏకవచనము మరియు ఈ పదము తిమోతిని సూచిస్తుంది. 6:21వ వచనమును మినహాయించి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

పౌలు ఉపయోగించిన “క్రిస్తులో,” “ప్రభువునందు,” మొదలగు మాటలకు అర్థము ఏమిటి?

క్రీస్తు మరియు విశ్వాసులు అన్యోన్య సహవాసమును కలిగియుందురని వ్యక్తము చేయుటకు పౌలు ఈ మాటలను ఉపయోగించియున్నాడు. ఇటువంటి మాటలను గూర్చిన ఎక్కువ వివరములకు రోమా పత్రిక యొక్క పరిచయమును దయచేసి చూడండి.

1 తిమోతి పుస్తకములోనున్న వాక్యములో కీలక విషయములు ఏమిటి?క్రిందనున్న వచనములవరకు, బైబిలుపరమైన ఆధునిక అనువాదములకు పాత అనువాదములకు వ్యత్యాసముండును. యుఎల్.టి(ULT) వాక్యములో ఆధునిక తర్జుమా ఉంటుంది మరియు పాత అనువాదమును పేజి క్రింది భాగములో పెట్టియుందురు. స్థానిక ప్రాంతములో బైబిలును తర్జుమా చేసినట్లయితే, తర్జుమాదారులు ఆ అనువాదములనే ఉపయోగించుకొనవలెను. ఒకవేళ స్థానిక భాషలో తర్జుమా లేకపోయినట్లయితే, తర్జుమాదారులు ఆధునిక తర్జుమాలనే ఉపయోగించుకొనవలెను.

  • “దైవ భక్తి అనేది ఎక్కువ ధనమును సంపాదించుకొనుటకు మార్గమైయున్నది.” కొన్ని పాత తర్జుమాలలో “దైవ భక్తి అనేది ఎక్కువ ధనమును సంపాదించుకొనుటకు ఒక మార్గము; అటువంటివాటినుండి బయటికి వచ్చుట” అని చదువుతారు. (6:5)

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)