te_tn_old/1ti/02/intro.md

2.6 KiB

తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 02 సాధారణ అంశాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

సమాధానము

ప్రతియొక్కరికి ప్రార్థించాలని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించుచున్నాడు. వారు పాలకులనుగూర్చి ప్రార్థించాలి, తద్వారా క్రైస్తవులు దైవికముగా మరియు గౌరవప్రదమైన విధానములో సమాధానముగా జీవిస్తారు.

సంఘములో స్త్రీలు

ఈ వాక్యభాగముయొక్క చారిత్రాత్మకతను మరియు సంస్కృతిపరమైన సందర్భమును ఎలా అర్థము చేసుకోవాలనేదాని మీద పండితులనబడేవారు విడిపోయారు. స్త్రీ పురుషులు అన్ని విషయాలలో పరిపూర్ణముగా సమానులేనని కొంతమంది పండితులు నమ్ముతారు. వివాహబంధములోనూ మరియు సంఘములోనూ విభిన్నమైన పాత్రలలో సేవ చేయాలని దేవుడు స్త్రీ పురుషులను సృష్టించియున్నాడని మరికొంతమంది పండితులు నమ్ముదురు. ఈ విషయాన్ని వారు ఎలా అర్థము చేసుకొనుటద్వారా ఈ వాక్య భాగమును వారు ఎలా తర్జుమా చేశారన్నదానిని గూర్చి తర్జుమాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగాలు

“ప్రార్థనలు, విజ్ఞాపనలు, మరియు కృతజ్ఞతలు”

ఈ పదాలన్నియు వాటి అర్థాలు ఒక్కదానికొకటి సంబంధించియుంటాయి. వాటిని విభిన్నమైన అర్థాలుగా చూడవలసిన అవసరము లేదు.