te_tn_old/1pe/05/intro.md

3.0 KiB

1 పేతురు పత్రిక 05 అధ్యాయము యొక్క సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

ప్రాచీన తూర్పు ప్రాంతములోని రచయితలు పేతురువలె ఈ విధముగా తమ పత్రికలను ముగించేవారు.

ఈ అధ్యాయములోని విశేష అంశములు

కిరీటములు

విశేషముగా మంచి కార్యములను చేసిన వారికి ఇచ్చు కిరీటమును ప్రధాన కాపరి బహుమానముగా ఇచ్చును. (చూడండి: rc://*/tw/dict/bible/other/reward)

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార భాష

సింహము

పశువులన్ని సింహమును చూసి భయపడతాయి మరియు సింహములు ప్రతి విధమైన ఇతర ప్రాణిని తింటుంది. అవి మనుష్యులను కూడా తింటాయి. దేవుని ప్రజలను సైతాను భయపెడుతుంది, సైతాను తమ దేహాలను హానిపరచును కానీ వారు దేవునియందు నమ్మికయుంచి ఆయనకు విధేయులైయుండిన యెడల వారు దేవుని పిల్లలుగా ఉండెదరు మరియు దేవుడు వారిని రక్షించునని బోధించుటకు పేతురు సింహము అనే ఈ ఉపమాలంకారమును ఉపయోగించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

బబులోను

పాత నిబంధన గ్రంథములో యేరుషలేమును నాశనము చేసిన, యూదులను తమ గ్రహాలనుండి తీసుకుపోయిన మరియు వారి మీద ఏలిన బబులోను దుష్ట దేశమైయుండెను. పేతురు బబులోను అను రూపకఅలంకారమును ఉపయోగించి ఆయన వ్రాయుచున్న క్రైస్తవులను హింసించు దేశముకు పోల్చిచెప్పుచున్నాడు. లేక అతను రోమాను ఉద్దేశించి మాటాడుచుండవచ్చును ఎందుకనగా రోమీయులు క్రైస్తవులను హింసించుచుండిరి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/evil]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])