te_tn_old/1pe/04/intro.md

3.4 KiB

1 పేతురు 04 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు సులభముగా ఉండుటకు పద్యభాగములోని ప్రతి పంక్తిని చదవడానికి వాక్యభాగాములో కంటెను కుడిప్రక్కన అమర్చుచున్నారు. పాతనిబంధనలోనుండి తీయబడిన కొన్ని వచనములను అనగా 4:18 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి తర్జుమా చేసింది.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు లేక అంశాలు

“భక్తిహీనులైన అన్యులు”

యూదేతరులైన భక్తిహీనులైన వారినందరిని సూచించుటకు “అన్యులు” అనే పదమును ఈ వాక్యభాగము ఉపయోగించుచున్నది. క్రైస్తవులుగా మారిన అన్యులనుగూర్చి ఈ వాక్యభాగము చెప్పుటలేదు. “శృంగారము, కోరికలు, త్రాగుడు, అల్లరి చిల్లరి వినోదాలు, విచ్చలవిడి విందులు, నిషిద్ధమైన విగ్రహ పూజలు” అనే క్రియలన్నియు భక్తిహీనులైన అన్యులు చేసే క్రియలని తెలియజేయుచున్నవి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/godly)

హతసాక్షులగుట

తమ నమ్మకాల నిమిత్తము మరణమును ఎదుర్కొనిన మరియు గొప్ప హింసను అనుభవించిన అనేకమంది క్రైస్తవులను గూర్చి పేతురు మాట్లాడుచున్నాడు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన కీలక విషయాలు

“ఉండనియుడి” మరియు “చేయవద్దు” మరియు “చేయనియ్యండి” మరియు “వాటిని చేయండి”

పేతురు తన చదువరులు ఏమి చేయాలని కోరుకొనుచున్నాడో దానిని చేయునట్లు పేతురు ఈ పదాలన్నిటిని ఉపయోగించుచున్నాడు. అవన్నియు ఆజ్ఞలవలెయున్నవి ఎందుకంటే ఆయన తన చదువరులందరూ విధేయత చూపాలని కోరుకొనుచున్నాడు. ఇతర ప్రజలు ఏమి చేయాలని కోరుకొనుచున్నాడో వాటినే అతడు ఒక వ్యక్తికి చెప్పినట్లుగా వీటన్నిటి విషయమై చెబుతున్నాడు.