te_tn_old/1co/front/intro.md

17 KiB
Raw Permalink Blame History

1 కొరింథీయులకు పత్రిక పరిచయం

భాగము 1: సాధారణ పరిచయం

1 కొరింథీ పుస్తకం యొక్క గ్రంధ విభజన

  1. సంఘంలో విభేదాలు (1: 10-4: 21)
  2. నైతిక పాపాలు మరియు అక్రమములు (5: 1-13)
  3. క్రైస్తవులు ఇతర క్రైస్తవులను న్యాయస్థానానికి (కోర్టు) తీసుకువెళ్ళుట (6: 1-20)
  4. వివాహం మరియు సంబంధిత విషయాలు (7: 1-40)
  5. క్రైస్తవ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం; విగ్రహాలకు బలి అర్పించిన ఆహారం, విగ్రహారాధన నుండి పారిపోవడం; మహిళల యొక్క తల కప్పుకొనుట(8: 1-13; 10: 1-11: 16))
  6. అపోస్తలుడిగా పౌలు హక్కులు (9: 1-27)
  7. ప్రభువు భోజనం (11: 17-34)
  8. పరిశుద్ధాత్మ వరములు (12: 1-31)
  9. ప్రేమ (13: 1-13)
  10. పరిశుద్ధాత్మ యొక్క వరములు: ప్రవచనము మరియు భాషలు (14: 1-40)
  11. విశ్వాసుల పునరుత్థానం మరియు క్రీస్తు పునరుత్థానం (15: 1-58)
  12. ముగింపు: యెరూషలేములోని క్రైస్తవులకు సహకారం, అభ్యర్ధనలు మరియు వ్యక్తిగత శుభములు (16: 1-24)

1 కొరింథీ పత్రికను ఎవరు రాశారు?

పౌలు 1 కొరింథీ పత్రిక వ్రాసాడు. పౌలు తార్సు నగరానికి చెందినవాడు. అతను తన ప్రారంభ జీవితంలో సౌలు అని పిలువబడ్డాడు. క్రైస్తవుడు కాకముందు పౌలు ఒక పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించాడు. అతను క్రైస్తవుడైన తరువాత, యేసును గురించి ప్రజలకు తెలియజేస్తూ రోమా సామ్రాజ్యం అంతటా అనేకసార్లు ప్రయాణించాడు.

కొరింథులోని సంఘాన్ని పౌలు ప్రారంభించాడు. అతను ఈ పత్రిక రాసేటప్పుడు ఎఫెసు నగరంలో ఉన్నాడు.

1 కొరింథీయుల పత్రిక దేనిగురించి వ్రాయబడింది?

1 కొరింథీయుల పత్రిక పౌలు కొరింథు ​​నగరంలో ఉన్న విశ్వాసులకు వ్రాసినది. అక్కడి విశ్వాసులలో సమస్యలు ఉన్నాయని పౌలు విన్నాడు. వారు ఒకరితో ఒకరు వాదించుకునేవారు. వారిలో కొందరు కొన్నిక్రైస్తవ బోధలను అర్థం చేసుకోలేదు. మరియు వారిలో కొందరు చెడుగా ప్రవర్తించారు. ఈ లేఖలో, పౌలు వారికి ప్రతిస్పందించి, దేవున్ని సంతోషపెట్టే విధంగా జీవించమని వారిని ప్రోత్సహించాడు.

ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షికతో పిలవడానికి ఎంచుకోవచ్చు, "" మొదటి కొరింథీయులు. "" లేదా వారు ""కొరింథులోని సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక భావనలు

కొరింథు నగరం ఎలా ఉండేది?

కొరింథు పురాతన గ్రీసులో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది మధ్యధరా సముద్రం సమీపాన ఉన్నందున, చాలా మంది ప్రయాణికులు మరియు వ్యాపారులు అక్కడ వస్తువులను కొనడానికి మరియు అమ్మడానికి వస్తూ ఉండేవారు. దీని ఫలితంగా నగరంలో అనేక రకాల సంస్కృతుల ప్రజలను ఈ నగరం కలిగి ఉండేది. అనైతిక మార్గాల్లో నివసించే ప్రజలను కలిగి ఉండడంలో ఈ నగరం ప్రసిద్ధి చెందింది. గ్రీకు ప్రేమ దేవత అయిన అఫ్రొదితును ప్రజలు ఆరాధించేవారు. అఫ్రోదితును గౌరవించడానికి జరిపే వేడుకల్లో, ఆమె ఆరాధకులు ఆలయ వేశ్యలతో లైంగిక సంబంధం కలిగి ఉండేవారు.

విగ్రహాలకు బలి అర్పించిన మాంసం విషయంలో సమస్య ఏమిటి?

కొరింథులో చాలా జంతువులను వధించి తప్పుడు దేవుళ్లకు బలి ఇచ్చేవారు. పూజారులు మరియు ఆరాధకులు కొంత మాంసం ఉంచుకునేవారు. మాంసంలో చాలా భాగం మార్కెట్లలో (సంతలలో) విక్రయించబడేది. ఈ మాంసం తినడం సరైనదా కాదా అని చాలా మంది క్రైస్తవులు ఒకరితో ఒకరు విభేదించేవారు, ఎందుకంటే ఇది ఒక అబద్ద దేవునికి అర్పించబడిందని. 1 కొరింథీలో పౌలు ఈ సమస్య గురించి వ్రాశాడు.

భాగము 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

(ULT) యుఎల్టి లో 1 కొరింథీలోని ""పరిశుద్దత"" మరియు ""పరిశుద్దపరచబడo"" గురించిన అంశాలు ఎలా ఉన్నాయి?

వీటిలో ఏదో ఒకదాని గురించిన వివిధ అంశాలను సూచించడానికి లేఖనాలు ఇలాంటి పదాలను ఉపయోగిస్తాయి. ఈ కారణంగా, అనువాదకులు వారి తర్జుమాల్లో వాటిని బాగా ఉపయోగించడం తరచుగా కష్టతరమైన విషయం. ఆంగ్లంలోకి అనువదించడంలో, 1 కొరింథీయుల (ULT) యుఎల్టి ఈ క్రింది సూత్రాలను ఉపయోగిస్తుంది:

ఒక భాగం లోని భావం కొన్నిసార్లు నైతిక పవిత్రతను సూచిస్తుంది. సువార్తను అర్ధం చేసుకోవడానిక గమనించాల్సిన ప్రత్యేకమైన ముఖ్యమైన విషయం ఏమంటే యేసుక్రీస్తుతో వారు ఐక్యమైనందున దేవుడు క్రైస్తవులను పాపము చేయనివారుగా గుర్తిస్తున్నాడనే నిజo. మరొక సంబంధిత వాస్తవం ఏమిటంటే దేవుడు పరిపూర్ణుడు మరియు దోషరహితుడు. మూడవ వాస్తవం ఏమిటంటే, క్రైస్తవులు జీవితంలో తమను తాము నిందారహితమైన, దోషరహితమైన ప్రవర్తన కలిగి ఉండేలా వ్యవహరించాలి. ఈ సందర్భాలలో, (ULT) యుఎల్టి ""పరిశుద్ధ,"" ""పరిశుద్దుడైన దేవుడు"", ""పవిత్రులు"" లేదా ""పవిత్ర ప్రజలు"" అనే పదాలను ఉపయోగిస్తుంది. (చూడండి: 1: 2; 3:17)

  • కొన్నిసార్లు ఒక భాగంలోని భావం వారు పోషించే నిర్దిష్టమైన పాత్రను సూచించకుండా కేవలం క్రైస్తవులను మాత్రమే సూచిస్తుంది. ఈ సందర్భాలలో, (ULT) యుఎల్టి ""విశ్వాసి"" లేదా ""విశ్వాసులు"" అనేవాటిని ఉపయోగిస్తుంది. (చూడండి: 6: 1, 2; 14:33; 16: 1, 15)
  • కొన్నిసార్లు ఆ భాగంలోని భావం ఎవరినైనా లేదా దేనినైనా దేవునికి మాత్రమే ప్రత్యేకించిన విషయాన్ని సూచిస్తుంది. ఈ సందర్భాలలో, [ULT] యుఎల్టి ""వేరుగా ఉంచుట,"" ""ప్రతిష్టించుట"" ""నిలిపి ఉంచుట"" లేదా ""పవిత్రపరచబడినది"" అని ఉపయోగిస్తుంది. (చూడండి: 1: 2; 6:11; 7:14, 34) అనువాదకులు ఈ ఆలోచనలను వారి స్వంత భాషాంతరాలలో ఎలా అనువదించాలో ఆలోచించడానికి (ULT) యుఎల్టి తరచుగా సహాయపడుతుంది.

“శరీరము” అనగా అర్ధం ఏమిటి? ""

పౌలు పాపపు పనులు చేసిన క్రైస్తవులను సూచించడానికి""శరీరము ""లేదా"" శరీరానుసారమైన""అనే పదాలను తరచుగా ఉపయోగించాడు. అయితే, చెడుగా ఉన్నది భౌతిక ప్రపంచం కాదు. నీతి మార్గంలో జీవించిన క్రైస్తవులను ""ఆత్మీయులు"" అని కూడా పౌలు అభివర్ణించాడు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ వారికి ఏమి చేయమని నేర్పించాడో దానిని వారు చేసారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/flesh]] మరియు [[rc:///tw/dict/bible/kt/righteous]] మరియు rc://*/tw/dict/bible/kt/spirit)

""క్రీస్తులో,"" ""ప్రభువులో"" అనే వ్యక్తీకరణల విషయంలో పౌలు భావం ఏమిటి? ఈ రకమైన వ్యక్తీకరణలు 1: 2, 30, 31 ; 3: 1; 4:10, 15, 17; 6:11, 19; 7:22; 9: 1, 2; 11:11, 25; 12: 3, 9, 13, 18, 25; 14:16; 15:18, 19, 22, 31, 58; 16:19, 24 వచనాలలో కనిపిస్తాయి. క్రీస్తుతో విశ్వాసులకున్న చాలా సన్నిహితమైన ఐక్యత అనే ఆలోచనను వ్యక్తపరచడమే పౌలు ఉద్దేశ్యం. అదే సమయంలో, అతను తరచుగా ఇతర అర్థాలను కూడా ఉద్దేశించాడు. ఉదాహరణకు, ""క్రీస్తుయేసులో పవిత్రులైన వారు"" (1: 2) చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసులు క్రీస్తుకు ప్రతిష్టింపబడ్డారని పౌలు భావిస్తున్నాడు.

ఈ రకమైన వ్యక్తీకరణ గురించి మరిన్ని వివరాల కొరకు రోమా పత్రిక ఉపోద్ఘాతాన్ని చూడండి. 1 కొరింథీ పుస్తకం యొక్క వచనాలలోని ప్రధాన సమస్యలు ఏమిటి?

క్రిoది వచనాల విషయంలో, బైబిల్ యొక్క ఆధునిక భాషాంతరాలు ప్రాచీన భాషాoతరాలతో విభేదిస్తాయి. అనువాదకులు బైబిల్ యొక్క ఆధునిక భాషాంతరాలను అనుసరించాలని సూచించడమైనది. అయినప్పటికీ, అనువాదకుల ప్రాంతంలో బైబిల్ యొక్క పాత భాషాంతరాల ప్రకారం చదివే బైబిళ్లు ఉంటే, అనువాదకులు వాటిని అనుసరించవచ్చు. అలా అయితే, ఈ వచనాలు 1 కొరింథీయుల యొక్క అసలైన వాటిలోనివి కావని సూచించడానికి చదరపు బ్రాకెట్లలో ([]) ఉంచాలి.

  • ""అందువల్ల మీ శరీరంతో దేవున్ని మహిమపరచండి."" కొన్ని పాత భాషాంతరాలలో ఈ విధంగా చదువబడింది ""అందువల్ల దేవునివైన మీ శరీరంతో మరియు మీ ఆత్మలో దేవున్ని మహిమపరచండి."" (6:20)
  • ""నేను ధర్మశాస్త్రం క్రింద లేనప్పటికీ నేను ఇలా చేసాను"" (9:20). కొన్ని పాత భాషాంతరాలు ఈ భాగాన్ని వదిలివేశాయి.
  • ""మనస్సాక్షి నిమిత్తము ఇతర వ్యక్తి యొక్క మనస్సాక్షి."" కొన్ని పాత భాషాంతరాలలో “మనస్సాక్షి నిమిత్తము: భూమి మరియు దానిలోని ప్రతిదీ ప్రభువుకు చెందినవి: ఇతర వ్యక్తి యొక్క మనస్సాక్షి"" అని చదవబడింది. (10:28)
  • ""మరియు నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా"" (13:3). కొన్ని పాత భాషాంతరాలలో ఈలాగు చదవబడ్డాయి, ""మరియు నేను ఉప్పొంగేలా నా శరీరాన్ని కాల్చబడడానికి అప్పగిస్తాను.""
  • ""అయితే ఎవరైనా దీనిని పట్టించుకోకపోతే ఆ వ్యక్తిని పట్టించుకోకండి"" (14:38). కొన్ని పాత భాషాంతరాలు ఇలా ఉన్నాయి, ""అయితే ఎవరైనా దీని గురించి తెలియనివాడైతే, అతడిని అజ్ఞానంగానే ఉండనివ్వండి.""

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)