te_tn_old/1co/16/intro.md

1.9 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పౌలు ఈ అధ్యాయములో చాలా విషయాలను క్లుప్తంగా వివరించాడు. పురాతనమైన తూర్పు దేశాలలో అక్షరాల చివరి భాగం వ్యక్తిగత అభినందనలు చెప్పటం సర్వసాధారణం.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

అతని రాక కొరకు సిద్ధపాటు

తన సందర్శన కొరకు కొరింథీసంఘమును సిద్ధం చేయుటకు ఆచరణాత్మక సూచనలు ఇచ్చాడు. యేరుషలేములోని విశ్వాసుల కోసం ప్రతి ఆదివారం చందా పోగుచేయడం ప్రారంభించాలని ఆతను చెప్పాడు. అతను వచ్చి శీతాకాలం వారితో గడపాలని ఆశించాడు. తిమోతి వారియోద్దకు వచ్చినప్పుడు సహాయం చేయమని చెప్పాడు. అపోల్లో వారి యొద్దకు వెళ్తాడని అతను ఆశించాడు, కాని అపోల్లో ఇది సరైన సమయం అని అనుకోలేదు. పౌలు స్తెఫనుకు కూడా లోబడి ఉండమని చెప్పాడు. చివరగా, అతను తన అభినందనలను అందరికి పంపాడు.