te_tn_old/1co/11/intro.md

4.6 KiB

1వ కొరింతీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఇది పత్రిక యొక్క క్రొత్త విభాగమునకు ప్రారంభమైయున్నది (అధ్యాయాలు 11-14). పౌలు ఇప్పుడు క్రమమైన సంఘ సేవల గురించి మాట్లాడుతాడు. ఈ అధ్యాయములో అతను రెండు విభిన్నమైన సమస్యలను పరిష్కరించాడు: సంఘ సేవలలో స్త్రీలు (1-16వచనాలు) మరియు ప్రభు రాత్రి భోజనం (17-34వచనాలు).

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

సంఘ సేవలో క్రమమైన ప్రవర్తన

అక్రమమైన స్త్రీలు

ఇక్కడ పౌలు సూచనలు విద్వాంసులతో చర్చించబడుతున్నాయి. స్థాపించబడిన సాంస్కృతిక ఆచారాలకు వ్యతిరేకముగా వెళ్ళడం ద్వారా వారి క్రైస్తవ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి సంఘాలలో అక్రమము కలిగించే స్త్రీలు ఉండవచ్చు. వారి కార్యములు కలిగించిన అక్రమము అతనికి చింతను కలిగించింది.

ప్రభు రాత్రి భోజనం

కొరింథీయులు ప్రభు రాత్రి భోజనమును ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై సమస్యలు ఉండేవి. వారు ఏకీకృతమైన పద్దతిలో నడచుకోలేదు. ప్రభు రాత్రి భోజనంతో పాటు జరుపుకునే విందు సందర్భంగా వారిలో కొందరు తమ స్వంత ఆహారమును పంచుకోకుండా తిన్నారు. వారిలో కొందరు త్రాగియుండగా పేద ప్రజలు ఆకలితో ఉన్నారు. విశ్వాసులు పాపం చేస్తున్నప్పుడు లేక ఒకరితో ఒకరు విరిగిన సంబంధాలతో ఉన్నప్పుడు వారు ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటే క్రీస్తు మరణమును అవమాన పరచారని పౌలు బోధించాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/reconcile]])

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

అలంకారిక ప్రశ్నలు

పౌలు సూచించిన ఆరాధన నియమాలు పాటించుటకు ప్రజలు ఇష్టపడనందుకు అతను వారిని గద్దించుటకు అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

శిరస్సు

పౌలు 3వ వచనంలోని “శిరస్సు”ను అధికారం కోసం ఒక మారుపేరుగా ఉపయోగిస్తాడు మరియు 4వ వచనంలో తరువాత వచనాలలో కూడా ఒక వ్యక్తీ యొక్క నిజమైన శిరస్సును గురించి తెలియచేయుటకు దీనిని ఉపయోగిస్తాడు. అవి చాలా దగ్గరగా ఉన్నందున పౌలు ఉద్దేశపూర్వకంగా “శిరస్సు”ను ఈ విధంగా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ వచనాలలోని ఆలోచనలు సంబంధించబడి ఉన్నాయని ఇది చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)