te_tn_old/1co/07/intro.md

2.6 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 07 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొరింథీయులు అడిగిన ప్రశ్నలకు పౌలు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. మొదటి ప్రశ్న వివాహం గురించి. రెండవ ప్రశ్న బానిస స్వాతంత్ర్యముగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, అన్యజనుడు యూదుడు అవుతాడు లేక యూదుడు అన్యజనుడు అవుతాడు అనే దాని గురించి.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

పరిత్యాగం

పెండ్లి అయిన క్రైస్తవులు పరిత్యాగం తీసుకోకూడదని పౌలు చెప్పాడు. అవిశ్వాసిని వివాహం చేసుకున్న క్రైస్తవుడు తన భర్తను లేక భార్యను విడచిపెట్టకూడదు. అవిశ్వాసియైన భర్త లేక భార్య వెళ్ళిపోతే ఇది పాపం కాదు. కష్ట సమయములలో మరియు యేసు తిరిగి వచ్చే కాలము సమీపముగా ఉన్నందున, పెండ్లి చేసికోకుండా ఉండటం అనుకూలమైనదైయున్నదిని పౌలు సలహా ఇస్తున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/believe]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

సభ్యోక్తులు

లైంగిక సంబంధాలను జాగ్రత్తగా తెలియచేయుటకు పౌలు అనేక సభ్యోక్తులను ఉపయోగిస్తాడు. ఇది తరచుగా సున్నితమైన అంశం. చాలా సంస్కృతులు ఈ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుటకు ఇష్టపడవు. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)