te_tn_old/1co/06/intro.md

2.2 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 06 అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

వ్యాజ్యము

అవిశ్వాసియైన న్యాయాధీపతి ముందు ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని కోర్టుకు తీసుకువెళ్లకూడదని పౌలు బోధిస్తున్నాడు. మోసపరచబడడం మంచిది. క్రైస్తవులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. కాబట్టి వారు తమలో తాము వివాదమును పరిష్కరించుకోగలగాలి. మరొక విశ్వాసిని మోసం చేయుటకు కోర్టును ఉపయోగించడం చాల చెడ్డ విషయం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/judge)

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారములు

పరిశుద్ధాత్మ ఆలయం ఒక ముఖ్యమైన రూపకఅలంకారమైయున్నది. ఇది పరిశుద్ధాత్మ నివసించే మరియు ఆరాధింపబడే స్థలమును గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయంలో అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగించాడు. అతను కొరింథీయులకు బోధిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్పుటకు అతను వాటిని ఉపయోగిస్తాడు. (చూడండి: rc: //te/ta/man/translate/figs-rquestion)