te_tn_old/1co/03/intro.md

18 lines
3.0 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# 1 కొరింథీయులకు 03 సాధారణ గమనికలు
## నిర్మాణం మరియు ఆకృతీకరణ
కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి ఉదహరింపబడిన వచనాలను పేజీలో కుడి వైపున చదవడానికి సులువుగా అమర్చుతాయి. 19 మరియు 20 వ వచనాల ఉదహరించబడిన పదాల విషయంలో ULT (యుఎల్టి) దీన్ని చేస్తుంది.
## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
### శరీర సంబంధమైన ప్రజలు
కొరింథీ విశ్వాసులు వారి అనీతియుత చర్యల వల్ల అపరిపక్వంగా ఉన్నారు. అతను వారిని ""శరీర సంబంధులు"" అని పిలిచాడు, అంటే అవిశ్వాసుల వలె వ్యవహరించడం. ""ఆత్మీయంగా"" ఉన్నవారికి వ్యతిరేకంగా ఈ పదం ఉపయోగించబడింది. వారి ""శరీరాన్ని"" అనుసరించే క్రైస్తవులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. వారు లోక జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/righteous]], [[rc://*/tw/dict/bible/kt/flesh]], [[rc://*/tw/dict/bible/kt/spirit]] మరియు [[rc://*/tw/dict/bible/kt/foolish]] మరియు [[rc://*/tw/dict/bible/kt/wise]])
## ఈ అధ్యాయంలోని భాషా రూపాలు
### రూపకం
ఈ అధ్యాయంలో చాలా రూపకాలు ఉన్నాయి. ఆత్మీయ అపరిపక్వతను ఉదహరించడానికి పౌలు ""పిల్లలు"" మరియు ""పాలు"" అని ఉపయోగించాడు. కొరింథులోని సంఘం అభివృద్ధి చెందడంలో అతను మరియు అపొల్లో పోషించిన పాత్రలను వివరించడానికి అతను నాటడం మరియు నీరు పోయడం వంటి రూపకాలను ఉపయోగించాడు. కొరింథీయులకు ఆత్మీయ సత్యాలను బోధించడానికి సహాయంగా మరియు అతని బోధలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయకరంగా పౌలు ఇతర రూపకాలను ఉపయోగించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])