Door43-Catalog_te_tn/rom/12/03.md

1.3 KiB

దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి

ఇక్కడ “కృప” అంటే దేవుడు పౌలును అపోస్తలుడుగా సంఘ నాయకుడుగా ఎంపిక చేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే దేవుడు నన్ను అపోస్తలుడుగా ఉచితంగా ఎంపిక చేశాడు.”

మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటె ఎక్కువగా ఎంచుకోవద్దు

“ఇతర మనుషులకంటే మీరు గొప్పవారు అనుకోవద్దు.”

తగిన రీతిగా

దీనిని ఒక కొత్త వాక్యంగా అనువదించ వచ్చు: “మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారో జాగ్రత్త పడండి.”

దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం

“దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం మేరకు మీరు సరిగా ఆలోచించాలి.”