Door43-Catalog_te_tn/rom/12/01.md

4.0 KiB

సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను

“దేవుడు వారి పట్ల కనుపరచిన కరుణను బట్టి సాటి విశ్వాసులు ఇలా చెయ్యాలని పౌలు కోరుతున్నాడు.”

సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి.

ఇక్కడ పౌలు “శరీరాలు” అనే మాటను మొత్తంగా వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. దేవునికి పూర్తిగా విధేయుడైన ఒక విశ్వాసిని యూదులు దేవుని బలిగా అర్పించే జంతువులతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆలయంలో బలిపీఠం పైన అన్నట్టుగా సమర్పించుకోండి.” (చూడండి : ఉప లక్ష్యక అలంకారం, ఉపమాలంకారం)

పవిత్రమూ, దేవునికి ఇష్టమైన

దీనికి 1) నైతికంగా పవిత్రం, “దేవునికి ప్రీతికరం” (చూడండి : ఏకమూలక పదాలు) లేక 2) “కేవలం దేవునికి మాత్రమే సమర్పించి ఆయనకు సంతోషం కలిగించేలా,” అని అర్థాలున్నాయి.

ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ

దీని అర్థాలు 1) “దేవుణ్ణి ఆరాధించడానికి సరి అయిన మార్గం” లేక 2) “మీ ఆత్మలో దేవుణ్ణి ఆరాధించవలసిన పధ్ధతి.”

ఈ లోక విధానాలను అనుసరించవద్దు.

దీని అర్థాలు 1) “లోకం ప్రవర్తించినట్టు ప్రవర్తించ వద్దు.” (యు డి బి చూడండి) లేక 2) “లోకం ఆలోచించిన విధంగా ఆలోచించ వద్దు.”

అనుసరించవద్దు

దీని అర్థాలు 1) “మీరు ఏమి చెయ్యాలో లోకం మీకు చెప్పకూడదు.” లేక “మీరు ఎలా ఆలోచించాలో లోకం మీకు చెప్పకూడదు” (యు డి బి చూడండి) లేక 2) “లోకం చేసినట్టు చేయవద్దు.” లేక “లోకం ఆలోచించినట్టు, చేసినట్టు చెయ్యవద్దు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

ఈ లోక విధానాలను

లోకంలో నివసించే అవిశ్వాసులు (చూడండి: అన్యాపదేశం).

మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం

దీన్ని క్రియాపదంగా అనువదించ వచ్చు: “మొదట మీ ఆలోచనావిధానాన్ని దేవుడే మలచనివ్వండి” లేక “మీ ఆలోచనావిధానాన్ని దేవుడే మలచి మీ ప్రవర్తనను ఆయనే మలచ నివ్వండి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)