Door43-Catalog_te_tn/rom/01/04.md

2.3 KiB

ప్రకటించబడింది

"ఆయన" అంటే యేసుక్రీస్తు. "ప్రకటించ బడింది" దీనిని క్రియా ప్రధాన వాక్యంగా రాయవచ్చు: "దేవుడు ఆయనను ప్రకటించాడు." (చూడండి: క్రియాశీల నిష్కియాత్మక)

పవిత్రమైన ఆత్మ సంబంధంగా

పవిత్రాత్మ అని రాయవచ్చు.

చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా

"ఆయన చనిపోయిన తరవాత తిరిగి బ్రతికించడం ద్వారా."

మేము కృప, అపొస్తలత్వం పొందాము

"దేవుడు నాకు కృపను బహుమానంగా ఇచ్చాడు. ఆయన నన్ను అపోస్తులుడుగా నియమించాడు." ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు అపోస్తులుడుగా ఉండడానికి కృపను బహుమానంగా యిచ్చాడు. ఇక్కడ "మేము" అనే పదం రోమా సంఘం లోని విశ్వాసులు కాక యేసును అనుసరించిన 12 మంది అపోస్తులకూ, పౌలుకూ వర్తిస్తుంది. (చూడండి: ప్రత్యేక విశేషణ వాక్యాలు, ద్వంద్వ నామవాచక ప్రయోగం)

ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా

"నామం." పౌలు ఈ మాటను యేసుకు సూచిస్తూ వాడాడు. ప్రత్యామ్నాయ అనువాదం:"అన్ని దేశాల్లో ఆయన విశ్వాసాన్నిబట్టి ఆయనకు విధేయులయ్యేందుకు నేర్పించాలి. (చూడండి. అన్యాపదేశం)