Door43-Catalog_te_tn/jas/04/01.md

5.3 KiB

మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి?

ఇది అలంకారిక ప్రశ్న. యాకోబు తన పత్రిక చదువుతున్న వారికి వేస్తున్న మందలింపు ప్రశ్న. అంతేగాక , “తగాదాలూ, అభిప్రాయభేదాలూ” ద్వంద్వ పదం . ఒకే విషయాన్ని నొక్కి చెప్పదానికి ఇలా చెబుతారు. దీన్ని ఇలా అనువదించవచ్చు “మీరు అస్తమానం ఎందుకు వాదించు కుంటూ ఉంటారో నాకు తెలుసు.” (చూడండి, అలంకారిక ప్రశ్న, ద్వంద్వ పదం)

మిమ్మల్ని మీరు …మీ…మీరు

4:1

3 లోని ఈ సర్వనామాలు బహువచనాలు. ఇవన్నీ యాకోబు రాసిన పత్రిక చదువుతున్న వారిని సూచిస్తున్నాయి. (చూడండి, “నీవు” రూపాలు)

మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?

ఇది అలంకారిక ప్రశ్న యాకోబు తన పత్రిక చదువుతున్న వారికి వేస్తున్న మందలింపు ప్రశ్న. దీన్ని ఇలా చెప్పవచ్చు: “ఇవి మీ మీ దుష్ట కోరికల్లో నుంచి పుడతాయి.” లేక “ఇవి ఎందుకంటే మీ దుష్ట కోరికల మూలానే.”

మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?

ఇక్కడ యాకోబు “దుష్ట కోరికలు” అనే దాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిగా చూస్తున్నాడు. “మీరు కోరే విషయాలు దుర్మార్గమైనవి. మీరు ఇతరుల విశ్వాసుల అవసరాలు పట్టించుకోరు.” (చూడండి, వ్యక్తిత్వారోపణ)

మీ సాటి విశ్వాసుల్లో

“మీ సభ్యుల్లో.” దీనికి ఇలా అర్థం చెప్పుకోవచ్చు1) స్థానిక విశ్వాసుల మధ్య పోరాటం ఉంది. లేక 2) పోరాటం అంతర్గతం. అది దుర్మార్గం జరిగించమని మీలో కోరిక కలిగిస్తున్నది.

మీకు లేని వాటిని కోరుకుంటారు

“మీకు లేని దానిని ఎప్పుడూ కోరుకుంటారు.”

హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగదాలాడుతున్నారు

“మీరు చంపుతారు” అనేది అతిశయోక్తి. వారు తాము కోరినది పొందడానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు అనేది నొక్కి చెప్పడానికి వాడిన మాట. దీన్ని ఇలా అనువదించ వచ్చు. “మీరు పొందడం వీలు లేని దాన్ని దక్కించు కోవడం కోసం అన్ని రకాల దుష్ట క్రియలు చేస్తారు.” (చూడండి, అతిశయోక్తి)

పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు

ఇది ఒకే విషయాన్ని వేరు వేరు విధానాల్లో నొక్కి చెప్పే ద్వంద్వ పదం. దీనికి ఇలా అర్థం చెప్పవచ్చు.“మీరు అస్తమానం పోరాడుతారు.”

చెడ్డ వాటిని అడుగుతారు

“మీరు తప్పు విషయాలు అడుగుతారు.” ఇలా అర్థం చెప్పుకోవచ్చు1) “మీరు దురుద్దేశాలతో అడుగుతారు. మీరు ప్రవృత్తి మంచిది కాదు.” లేక 2) “ మీరు పొరపాటు విషయాల కోసం అడుగుతున్నారు.”

ఖర్చు చేసేందుకు

“వ్యయ పరిచేందుకు”