Door43-Catalog_te_tn/jas/03/03.md

3.7 KiB

గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి

యాకోబు మనుషుల నాలుకను ఇనుప ముక్కతో పోలుస్తున్నాడు. గుర్రాన్ని అదుపులో ఉంచుకోడానికి చిన్న ఇనుప ముక్కను దాని నోటిలో పెడతారు. ఏ విధంగా చిన్న విషయాలకు కొన్ని సార్లు పెద్ద వాటి కంటే ఎక్కువ శక్తి ఉంటుందో వర్ణిస్తున్నాడు. మనుషులు పలికే మాటలు వారి జీవితాన్ని, వారికి పరిచయం ఉన్న ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుందని యాకోబు చెబుతున్నాడు. (రూపకాలంకారం. చూడండి)

చేస్తాం కదా

“ఒకవేళ” లేక “ఎప్పుడైటతే.”

దాని నోటికి మాత్రం కళ్ళెం పెట్టి

“గుర్రం” ఒక పెద్ద జంతువు. బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఇలా అనువదించ వచ్చు. “గుర్రాల నోళ్ళలో.”

ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు

తరువాత యాకోబు వ్యక్తుల నాలుకను ఓడ చుక్కానితో పోలుస్తున్నాడు. “ఓడ” అంటే నీటిపై తేలే పెద్ద లారీ వంటిది. “చుక్కాని” ఒక చిన్న చెక్క, లేక లోహపు ముక్క ఓడ వెనుక భాగంలో ఉంటుంది. అది ఎటు వెళ్ళాలో చుక్కాని అదుపు చేస్తుంది. అంతేగాక “చుక్కాని” అనే పదం ఒక “పరికరం” గా చెప్పవచ్చు. ఇక్కడ యాకోబు దీన్ని గుర్రం నోట్లో ఉండే లోహం ముక్కలాగా పెద్ద దానిని అదుపులో ఉంచే దాన్ని ఇది సూచిస్తున్నది.

పెద్దవిగా ఉన్నా

అంటే ఓడలు.

బలమైన గాలులతో

దీన్ని కర్తరి క్రియా పదంతో ఇలా అనువదించ వచ్చు: “బలమైన గాలులు వాటిని ముందుకు తోస్తాయి.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)

ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు

దీన్ని కర్తరి క్రియా పదంతో ఇలా

అనువదించ వచ్చు: “చిన్న పరికరం ఒకడు ఓడ ఎక్కడికి పోవాలో అదుపు చేసేలా చేస్తుంది.”