Door43-Catalog_te_tn/gal/03/23.md

2.1 KiB

మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము

“ధర్మశాస్త్రం మనలను ఒక చెరసాల కాపలా దారునిగా అదుపులో పెట్టుకుంది.” (రూపకం, చూడండి)

విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ

“దేవుడు క్రీస్తు పై విశ్వాసం ఉంచిన వారిని నిర్దోషులుగా తీర్చుతాడు.” లేక “క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తాను నిర్దోషులుగా తీర్చుతాడని వెల్లడి చేసే వరకూ.”

క్రీస్తు కాలానికి మనలను నడిపించడానికి

“క్రీస్తు వచ్చే దాకా.”

నీతిమంతులుగా తీర్చి

“మనం నీతిమంతులుగా ప్రకటించ బడతాము.” దేవుడు క్రీస్తు కాలానికి ముందే నీతిమంతులుగా తీర్చడానికి పథకం వేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చే పథకాన్ని అమలు చేశాడు.

ప్రాథమిక ఉపాధ్యాయుడిగా

దీన్ని కొన్నిసార్లు “ఉపాధ్యాయుడు” గా అనువదించ వచ్చు. అయితే ఇది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. ఈ సంరక్షకుడు సాధారణంగా ఒక బానిస. వారసుణ్ణి నైతిక, ఫలప్రదమైన వ్యక్తిగా మలచడానికి ఇతడు బాధ్యుడు.