Door43-Catalog_te_tn/gal/03/04.md

3.0 KiB

వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా

గలతీయులు పడిన కష్టాలు వారికి గుర్తు చేస్తూ పౌలు ఈ అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న.)

ఇన్ని కష్టాలు

దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు1) “ఎన్నో మేలులు, కీడులు అనుభవించారు.” (యు డి బి చూడండి) లేక 2) “క్రీస్తు కోసం వారి నిర్ణయం మూలంగా ఎన్నో యాతనలు, హింసలు పడ్డారు. లేక 3) “ధర్మశాస్త్రం పాటించడానికి చాలా బాధలు పడ్డారు.

అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా

దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు1) “ఆయనలో నమ్మకం పెట్టుకోకపోతే దానంతటికీ విలువ లేదు.” (యు డి బి) లేక 2) ఒకవేళ గలతీయులు ధర్మశాస్త్రం పాటించడానికి బాగా కష్ట పడుతూ ఉంటే, “మీరు పడిన కష్టమంతా నిష్ప్రయోజనం అయిపోతే,” అంటే అర్థం వారుక్రీస్తు పై కాక మంచి పనులపై ఆధారపడుతున్నారు. దేవుడు వారిని విశ్వాసులుగా పరిగణించడు.

ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలన చేయిస్తున్నాడా, లేక విశ్వాసంతో వినడం వల్లనా?

మనిషి ఆత్మను ఎలా పొండుతాడో జ్ఞాపకం చెయ్యడానికి పౌలు గలతీయులను మరొక అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. దీన్ని ఇలా తర్జుమా చేయ వచ్చు“ధర్మశాస్త్రం పాటించడం వలన కాదు; అతడు విశ్వాసంతో వినడం వల్లనే పొందుతాడు.”

ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా

“ధర్మశాస్త్రం మనకు చెప్పినది చెయ్యడం వల్లనా?”

విశ్వాసంతో వినడం వల్లనా

“మనం సందేశం విని యేసుపై నమ్మకం ఉంచడం వల్ల.”