Door43-Catalog_te_tn/col/04/02.md

1.6 KiB

ప్రార్థనలో నిలిచి ఉండండి

“నమ్మకంగా ప్రార్థిస్తూ ఉండండి.” లేక “ఎడతెగక ప్రార్థించండి.”

నా కోసం

“నా” అనే పదం పౌలుకు, తిమోతికి వర్తిస్తుంది. కొలస్సీ విశ్వాసులకు కాదు.

దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని

ఇది ఒక జాతీయం. “దేవుడు అవకాశాలు ఇస్తాడు అని దీని అర్థం.” (చూడండి, జాతీయం)

క్రీస్తు మర్మాన్ని

ఆయన రాక ముందు అర్థం కాని యేసు క్రీస్తు సందేశం.

ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను

“యేసు క్రీస్తు సందేశం ప్రకటించినందుకే నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను.”

నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.

“యేసు క్రీస్తు సందేశం నేను చెప్పవల్సినంత స్పష్టంగా చెప్పగలిగేలా నాకోసం ప్రార్థించండి.”