Door43-Catalog_te_tn/col/02/20.md

3.2 KiB

ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు

ఈ అలంకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు భౌతికంగా అతనికి ఇక అవసరాలు ఏమీ ఉండవు గనక అతడు ఈ భౌతిక ప్రపంచంలో అవసరమైన వాటికి (ఊపిరి, నిద్ర మొ.) అతడు లోబడనవసరం లేదు అని చెబుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి క్రీస్తులో ఆత్మ సంబంధంగా మరణిస్తే ఈ లోక వ్యవస్థకు చెందిన ఆత్మ సంబంధమైన నియమాలకు లోబడనవసరం లేదు. (చూడండి, రూపకం)

కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి

కొలస్సీయులు ఈ లోకపు కుహనా నమ్మకాలకు లోబడుతున్నందుకు వారిని పౌలు గద్దిస్తున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు. ఒక మాటగా: “ఈ ప్రపంచం నమ్మకాలకు మిమ్మల్ని మీరు లోబరచుకోవడం చాలించండి!” (చూడండి, అలంకారిక ప్రశ్న)

లోబడి ఉండాలి?

“లొంగి” లేక “కట్టుబడి” లేక “విధేయతగా.”

నాశనమైపోయే

“శిథిలమైపోయే.”

వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి

“ఈ నియమాలు మానవ దృక్పథంలో అతి వినయంగా కనిపించడం, శరీరాన్ని హింసించుకోవడం వంటి విషయాల మూలంగా జ్ఞానం అనిపించుకుంటాయి.”

శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం

“కఠినం” లేక “నొప్పించే రీతిలో” లేక “అణిచి వేసే రీతిలో.”

శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి

“మీ మానవ కోరికలను వెంబడించకుండా అవి మిమ్మల్ని ఆపడానికి సహాయం చెయ్యలేవు.”