Door43-Catalog_te_tn/col/02/18.md

2.8 KiB

మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా

“ఎవరూ కూడా వారికి రావలసిన బహుమతి పోగొట్టుకోకుండా చూడండి.” ఈ అలంకారం కొలస్సీ విశ్వాసుల రక్షణను కొందరు వ్యక్తులు కుహనా వినయం, దేవదూతల పూజలు దొంగలు దోచుకున్నట్టు నష్ట పరుస్తున్నాయి అని తెలియజేస్తున్నది. ఈ కర్మణి క్రియపదాన్ని కర్తరి రూపంలో ఇలా అనువదించ వచ్చు. “ఎవరూ మీ బహుమానం అపహరించకుండేలా చూసుకోండి.” (చూడండి, చూడండి, కర్తరి, కర్మణి వాక్యాలు)

కపట వినయం

“కల్పించుకున్న వినయం.” కొందరికి వినయంలాగా కనిపించేది. దీన్ని ఇలా అనువదించ వచ్చు. “దొంగ భక్తితో కూడిన స్వయోపేక్ష.”

అతిశయోక్తిగా చెప్పుకుంటాడు

మనసును అస్తమానం అదుపు చేస్తూ ఉండే పధ్ధతి, ఏదో ఒక దాన్ని విపరీతంగా అంటి పెట్టుకుని ఉండే విధానం.

శరీర సంబంధమైన ఆలోచన వల్ల

ఆత్మ సంబంధమైన వ్యక్తి వలె కాక శరీరిలాగా ఆలోచించడం.

అంటి పెట్టుకుని ఉండడు.

పిల్ల వాడు తన తల్లిని గట్టిగా హత్తుకుని ఉన్నట్టు “స్థిరంగా చేపట్టి” లేక “అంటి పెట్టుకుని” ఉండడం.

క్రీస్తు ... ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది

ఈ అలంకారం సంఘంపై క్రీస్తు అధికారం శరీరం అంతటినీ పాలించి అదుపులో పెట్టే శిరస్సును వర్ణిస్తున్నది. (రూపకాలంకారం. చూడండి)