Door43-Catalog_te_tn/act/16/01.md

1.6 KiB

వచ్చాడు

కథనంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. మీ భాషలో దీనికి వేరే పద్ధతి ఉండవచ్చు.

అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత

“క్రీస్తును నమ్మిన ఒక యూదు స్త్రీ కొడుకు.”

మంచి పేరు ఉంది

“తిమొతి కి మంచి పేరు ఉంది.” లేక “ విశ్వాసులు అతని గురించి మంచి మాటలు చెప్పారు.”

అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి

“పౌలు తిమొతిని తనతో రమ్మన్నాడు. కాబట్టి పౌలు తిమొతిని తీసుకు వెళ్ళాడు.” ఇక్కడ సర్వనామాలు (అతడు, అతన్ని మొ.) తిమొతిని సూచిస్తున్నాయి.

అతని తండ్రి గ్రీసు దేశస్థుడని

గ్రీకు జాతీయుడు గనక తిమొతి తండ్రి తిమొతికి సున్నతి చేయించి ఉండక పోవచ్చు. కాబట్టి పౌలు అతనికి సున్నతి చేయించాడు. సున్నతి సాధారణంగా పౌలు లాంటి యూదు రబ్బీ చేస్తాడు.