Door43-Catalog_te_tn/act/15/05.md

1.5 KiB

కానీ

లూకా ఇక్కడ “రక్షణ కేవలం యేసులోనే” అనేదానికీ, నమ్మిన పరిసయ్యులు కొందరు చెప్పినట్టు “యేసును విశ్వసించిన దానికి అదనంగా రక్షణకోసం సున్నతి కూడా అవసరం” అనే దానికీ తేడా చెబుతున్నాడు.

సున్నతి చేయించాలనీ, ... వారికి ఆజ్ఞాపించాలనీ

“వారికి” అనేది ఇంతకు ముందు సున్నతి పొందని యూదేతర విశ్వాసులను సూచిస్తున్నది.

ధర్మశాస్త్రాన్ని పాటించేలా

“ధర్మశాస్త్రానికి విధేయత చూపడం” లేక “ధర్మశాస్త్రాన్ని అనుసరించడం.”

ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి

“నమ్మకాల్లో ఈ తేడా గురించి చర్చించడం.” పౌలు సువార్త రక్షణ సందేశానికి (యేసులోనే రక్షణ), పరిసయ్యుల సువార్తకీ(సున్నతి, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ).