Door43-Catalog_te_tn/act/06/01.md

2.2 KiB

ఆ రోజుల్లో

ఇది కొత్త భాగం పరిచయం. మీ భాషలో కొత్త భాగాలను ఎలా ఆరంభించాలో చూడండి.

పెరుగుతున్నపుడు

"విశేషంగా వృద్ధి చెందుతున్నది."

గ్రీకు భాష మాట్లాడే యూదులు

కొందరు యూదులు ఇశ్రాయేలు బయట రోమా సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఎక్కువ కాలం నివసించిన వారు. వీరు గ్రీకు భాష మాట్లాడేవారు. ఇశ్రాయేలు దేశంలో పెరిగిన వారికంటే వీరి భాష, సంస్కృతి కొద్దిగా తేడాగా ఉంటుంది.

హీబ్రూ

ఇశ్రాయేలులో అరామిక్ మాట్లాడుతూ పెరిగిన యూదులు. యూదులూ, యూదమతంలోకి మారినవారు మాత్రమే ఇంతవరకు సంఘంలో ఉన్నారు.

వితంతువులను

భర్త చనిపోయి, మరల పెండ్లి చేసుకోలేని పెద్దవయస్సు, బాగోగులు చూసుకోవడానికి బంధువులెవరూ లేని స్త్రీ మాత్రమే నిజమైన వితంతువు.

రోజువారీ భోజనాల వడ్డన

అపోస్తలులకు ఇచ్చిన డబ్బులో కొంత భాగం సంఘంలోని వితంతువులకు భోజనం కొనడానికి వాడేవారు.

చిన్నచూపు చూస్తున్నారు

"నిర్ల్యక్ష్యానికి గురి కావడం." సహాయం అవసరమైనవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొద్దిమందికి సహాయం అందడం లేదు.