Door43-Catalog_te_tn/1ti/04/01.md

2.5 KiB

విశ్వాసాన్ని వదిలేస్తారు

"యేసులో ఉంచిన విశ్వాసాన్ని అణిచివేసుకుంటారు" లేక "వారు ఏమి విశ్వాసించారో దాని నుంచి తొలగిపోతారు."

చివరి రోజుల్లో

సరిపడే అర్ధాలు 1) పౌలు తరువాత కాలంలో, "రానున్న కాలంలో" లేక "భవిష్యత్తులో" లేక 2) పౌలు జీవించి ఉన్న సమయంలో , "ముగింపుకి ముందు జరిగే కాలంలో."

దృష్టిపెట్టు

"శ్రద్ధ చూపించడం ద్వారా" లేక "వారు గమనించడం వలన" లేక "వినడం వలన" లేక "ఎవరైతే వీటిని లక్ష్య పెడతారో."

మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ

"ప్రజలను మోసపరచే ఆత్మలూ, దయ్యాలు బోధించే విషయాలు."

అబద్ధాలు చెపుతారు

"వేషధారులు అబద్ధాలు చెప్పే బోధిస్తారు."

వారికి వాత పడిన మనస్సాక్షి ఉంది

ఇది ఉపమాలంకారంగా యజమానులు తమ యాజమాన్యాన్ని చూపించేటందుకు బానిసల లేక జంతువుల చర్మాలపై కాల్చిన లోహంతో ముద్రించడాన్ని చూపుతుంది. సరిపడే అర్ధాలు 1) ముద్ర వేయడం గుర్తింపు చిహ్నంగా ఉంది, "వారు వేషధారులని చూసినప్పటికీ వారు అలా చేస్తారు," లేక 2) "వారి మనసాక్షి మొద్దుబారిపోయింది, "వారు తమ మనస్సాక్షికి వ్యతిరేకంగా కాల్చిన లోహంతో ముద్రించిన రీతిగా మొద్దుబారిపోయారు." (చూడండి: ఉపమాలంకారం)