Door43-Catalog_te_tn/1ti/03/11.md

4.0 KiB

అలాగే వారి భార్యలు కూడా

"భార్యలు, జ్ఞానం కలిగి ఉండడం అవసరం" లేక "పరిచారకురాళ్ళు సైతం పరిచారకుల వలె ఉండడం అవసరం." స్త్రీలు అనే పదం సాధారణంగా స్త్రీలకే వర్తిస్తుంది, కాని ఇక్కడ పరిచారకుల భార్యలకు లేక స్త్రీలకూ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కింది వచనాలు కచ్చితంగా పరిచారకుల గురించి చెబుతున్నాయి.

గౌరవింప దగినవారూ

"సరిగ్గా ప్రవర్తించండి"

అపనిందలు ప్రచారం చేయనివారూ

"వారు ఇతరుల గురించి చెడుగా చెప్పకూడదు."

అదుపులో ఉంచుకొనేవారూ

"వారు ఏదైనా సరే మితిమీరి చేయకూడదు."

ఒకే భార్యని కలిగినవారూ

ఈ వాక్యం అర్ధం "ఏకపత్ని పురుషులు." దీనిని "ఒక పురుషునికి ఒకే భార్యను కలిగి ఉండడం" గా అనువదించవచ్చు. ఇది ఒంటరిగా ఉన్నా, విడాకులు తీసుకున్నా, భార్యలను కోల్పోయిన పురుషులను మినహాయించడమా, లేదా అనే విషయంపై చర్చ కొనసాగింది.

తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనే వారుగా ఉండాలి

"వారి పిల్లలనూ, వారి ఇళ్ళలో నివసించే ఇతరులను జాగ్రత్తగా చూసుకుంటూ, వారిని సరిగ్గా నడిపించాలి."

వారు

"పరిచారకులైన వారు" లేక "అధ్యక్షులు, పరిచారకులు, పరిచారకురాళ్లు" లేక "సంఘ పెద్దలు."

వారు ......సంపాదించుకొని

"తమంతట తాము పొంది" లేక "తమంతట తాము సంపాదించుకుని."

మంచి స్థానం

సరిపడే అర్ధాలు

1)సంఘంలో మంచి పేరు, లేక 2) దేవుని ఎదుట నిలచియుండడం 3) సంఘంలో ఉన్నతమైన హోదా పొందడం. ఊదా: అధ్యక్ష్యపదవి కలిగియుండడం.

సంపాదించుకొని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు

వారి విశ్వాసం గురించి మాట్లాడడానికి ధైర్యాన్ని సంపాదించుకొంటారు" లేక "వారు ఏదైతే సత్యమని విశ్వసించారో దానికి నమ్మకస్తులైవుంటారు" లేక "దేవుని ఎదుట, మనుషుల ఎదుట వారు ఏదైతే సత్యమని తెలుసుకున్నారో దానికి నమ్మకస్తులై ఉంటారు" లేక "వారు ఏదైయితే నమ్మారో దాని గురించి మాట్లాడడానికి ధైర్యాన్ని సంపాదించుకొంటారు"