Door43-Catalog_te_tn/1co/15/31.md

1.4 KiB

నేను ప్రతి దినం చనిపోతున్నాను

పౌలు పాపపూరితమైన కోరికలను తిరస్కరించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు.

ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది

దీనికి ఇలా అర్థం చెప్పుకోవచ్చు. 1). పౌలు ఇక్కడ విద్వాంసులైన పరమతస్తులతో తన వాదనలను గురించి సాదృశ్యరీతిలో మాట్లాడుతున్నాడు. లేక 2). క్రూర మృగాలున్న వినోద క్రీడా స్థలంలో అతన్ని పడవేశారేమో.

రేపు చనిపోతాం కాబట్టి తిని, తాగుదాం

పౌలు ఇలా ముగిస్తున్నాడు. మరణం తరువాత ఆపై జీవితం లేకపోతే గనక రాబోయే రోజుల్లో ఎలాటి ఆశాభావం లేకుండా మన బ్రతుకు అంతం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జీవితాన్ని చక్కగా అనుభవించడమే మంచిది.