Door43-Catalog_te_tn/1co/08/01.md

2.1 KiB
Raw Blame History

ఇప్పుడిక

పౌలు ఈ మాటను కొరింతీయులు అడిగిన మరొక ప్రశ్నకు జవాబు మొదలు పెట్టడానికి వాడుతున్నాడు.

విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం

విగ్రహారాధకులు ధాన్యం, చేపలు, కోళ్ళు, లేక మాంసం దేవుడికి అర్పిస్తారు. పూజారులు దానిలో కొంత బలిపీఠంపై కాల్చేసే వారు. పౌలు ఇక్కడ మిగిలిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ భాగాన్ని ఆరాధకుడు తీసుకుంటాడు, లేదా కొట్లో అమ్ముతారు.

మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు

పౌలు కొరింతీయులు వాడే నానుడి వాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనందరికీ తెలుసు. మీరే అంటారు గదా ‘మనందరం తెలివైన వాళ్ళమే.

మిడిసిపడేలా చేస్తుంది

“గర్వం కలుగజేస్తుంది.” లేక “తాము ఉన్న దానికంటే ఎక్కువగా ఉహించుకునేలా చేస్తుంది.”

తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే

“అన్నిటి గురించీ ఎంతో కొంత తెలుసుననుకోవడం.”

దేవునికి అతడు తెలుసన్నమాట

“దేవుడు ఆ వ్యక్తిని ఎరుగును.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).