Door43-Catalog_te_tn/jhn/05/01.md

1.6 KiB

ఇది అయిన తరువాత

అధికారి కుమారుణ్ణి బాగు చేసిన తరువాత (4:46 54)

యెరూషలేముకు వెళ్ళాడు

యెరూషలేము ఒక కొండపై ఉంది. యెరూషలేముకు వెళ్ళే రహదారులు చిన్న చిన్న కొండల మీదుగా వెళ్తాయి. మీ భాషలో చదును నేలపై కాకుండా ఎక్కి పోయే దారిని సూచించడానికి వేరే పదం ఉంటే ఇక్కడ ఉపయోగించండి.

కోనేరు

నీరు నిలవ ఉండే పెద్ద గుంట.

బెతెస్డ

“బెతెస్డ” అంటే కరుణ ఇల్లు. (చూడండి : నామవాచకాల అనువాదం)

మంటపాలు

మంటపం అంటే ఏదైనా ఒక నిర్మాణానికి అనుకుని కట్టిన వసారా. పై కప్పు ఉండి, కనీసం ఒక వైపు గోడ లేకుండా కట్టిన పందిరి లాంటిది.

గుంపులుగా

చాలామంది.

వచనం 4

కొన్ని ప్రాచీన వాచకాల్లో ఈ వచనం ఉంది. కొన్నింటిలో లేదు. 3, 4 వచనాలు కలిపి అనువదిస్తే మంచిది.