Door43-Catalog_te_tn/1jn/04/17.md

2.5 KiB

తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది

ఇలా అర్థాలు చెప్పుకోవచ్చు 1) దీని కోసం 4:16 చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒకడు ప్రేమలో జీవిస్తే అతడు దేవునిలో దేవుడు అతనిలో ఉన్నారు. మన ప్రేమ పరిపూర్ణం అయింది.తీర్పు దినాన పూర్తి ఆత్మ స్థైర్యం ఉంది.” లేక 2) అంటే “ఆత్మ స్థైర్యం.” ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చే రోజున దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అప్పుడు మనలో ప్రేమ పరిపూర్ణం అయిందని తెలుస్తుంది.”

ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.

“యేసుకు దేవునితో ఉన్న సంబంధం దేవునికి మనతో ఉన్న సంబంధమే.”

పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది

ఇక్కడ “ప్రేమ” అంటే భయం పోగొట్టడానికి ఒక వ్యక్తికి శక్తిని ఇచ్చేది. ప్రత్యామ్నాయ అనువాదం: “మన ప్రేమ సంపూర్ణం అయినప్పుడు మనకిక భయం ఉండదు.” (చూడండి: వ్యక్తిత్వారోపణ)

ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది

“దేవుడు న్యాయాధికారిగా ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చే సమయంలో మనల్ని శిక్షిస్తాడని భయపడతాము.”

భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు

“ఒకడు భయపడుతున్నాడంటే అతని ప్రేమ పరిపూర్ణం కాలేదు.”