Door43-Catalog_te_tn/luk/08/28.md

2.1 KiB

వాడు యేసును చూసి

"దయ్యం పట్టినవాడు యేసును చూసి"

కేకలు వేశాడు

"గట్టిగా అరిచాడు" లేదా "గొంతు చీల్చుకుని అరిచాడు"

ఆయన ముందు పడ్డాడు

"యేసు ముందు నేలమీద సాష్టాంగ పడ్డాడు" అతడు అనుకోకుండా పడలేదు. యేసుకు భయపడి అలా చేశాడు.

కేకలు పెట్టాడు

"పెద్ద శబ్దంతో చెప్పాడు" లేదా "అరిచాడు"

నా జోలి నీకెందుకు

దీనిని యిలా అనువదించవచ్చు,"నన్నెందుకు బాధపెడతావు."

అది చాలా సార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది

"చాలా సార్లు వాడిని పట్టేసుకుంది." దీనిని యిలా అనువదించవచ్చు,"చాలా సార్లు వాడి లోపలికి వెళ్ళింది." యేసు అతని దగ్గరకు వెళ్లకముందు చాలా సార్లు దయ్యం అతనికి చేసిన దానిని, యిదీ తర్వాత వాక్యమూ తెలియ చేస్తున్నాయి.

వాణ్ణి గొలుసులతోనూ కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు కానీ

దీనిని యిలా అనువదించవచ్చు,"ప్రజలు అతన్నిగొలుసులతోనూ కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టినా"(చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive)