Door43-Catalog_te_tn/luk/06/24.md

2.0 KiB

(యేసు తన శిష్యులకు బోధించడం కొనసాగిస్తూ ఉన్నాడు.)

మీకు యాతన

ఈ మాట మూడు సార్లు వచ్చింది. "మీరు ధన్యులు." అనే మాటకు ఇది వ్యతిరేకం. దేవుని కోపం, ప్రజలపై ఉందనీ వారికి కీడు గానీ ఏదైనా చెడు గానీ సిద్ధంగా ఉందని ఆమాట చెబుతున్నది.

ధనికులారా, మీకు యాతన

"ధనికులైన మీకు ఎంత భయంకరం!" లేదా "ధనికులైన మీకు శ్రమ రాబోతూ ఉంది." దీనిని ఇలా అనువదించవచ్చు,"ధనికులైన మీకు ఎంత విచారకరం!" లేదా ,"ధనికులైన మీరు ఎంత విచారం పొందబోతూ ఉన్నారు."

మీరు ఇప్పటికే పొందారు

"మీరు ఇప్పటికే సంపూర్తిగా పొందారు" లేదా "మీరు పొందాల్సి ఉన్న దాన్నంతా ఇప్పటికే పొందారు"

మీరు కోరిన ఆదరణ

"మీకు ఆదరణ గా ఉండేది" లేదా "మీకు సంతృప్తిగా ఉండేది" లేదా "మీకు సంతోషం కలిగించేది"

ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు

"ఇప్పుడు కడుపులు నిండి ఉన్న వాళ్ళు" లేదా "ఇప్పుడు బాగా తింటున్న మీకు"

ఇప్పుడు నవ్వుతున్న మీకు

"ఇప్పుడు సంతోషంగా ఉన్న మీకు"