Door43-Catalog_te_tn/1co/10/14.md

2.0 KiB

విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.

“గట్టి నిర్ణయంతో విగ్రహ పూజ నుండి పారిపోండి.” (చూడండి: రూపకాలంకారం).

స్తుతులు చెల్లించే పాత్రలో

పౌలు ఈ మాటను ప్రభువు బల్ల దగ్గర ఉపయోగించే ద్రాక్షరసం నిండిన గిన్నెను సూచించడానికి ఉపయోగించాడు.

క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే?

మనం పంచుకుని తాగే ద్రాక్షారసం గిన్నె క్రీస్తు రక్తం. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం క్రీస్తు రక్తంలో పలు పొందుతున్నాము.” (యు. డి. బి.; చూడండి: అలంకారిక ప్రశ్న).

మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే?

ప్రత్యామ్నాయ అనువాదం: “మనం రొట్టె పంచుకుని తినేటప్పుడు క్రీస్తు శరీరం లో భాగం పంచుకుంటున్నాము.” (యు. డి. బి.; చూడండి: అలంకారిక ప్రశ్నలు).

భాగం పంచుకోవడమే

“పాలుపంచుకుంటున్నాము.” లేక “ఇతరులతో కలిసి సమానంగా తింటున్నాము.”

రొట్టె

వండిన ఒక రొట్టెను ముక్కలుగా తుంచి తింటారు.