Door43-Catalog_te_tn/1co/10/01.md

1.7 KiB

మన పితరులు

పౌలు ఇక్కడ మోషే కాలానికి పోలుస్తూ నిర్గమ కాండంలో ఇశ్రాయేల్ వారు ఈజిప్టు సేనలు వెంట తరుముతుండగా ఎర్ర సముద్రం గుండా తప్పించుకున్నారు. “మన” అనేది కలుపుకునే భాష రీతి. ప్రత్యామ్నాయ అనువాదం: “యూదుల పితరులు.” (చూడండి: కలుపుకొన్న).

బాప్తిసం పొందారు

ప్రత్యామ్నాయ అనువాదం: “అందరూ మోషేను అనుసరిస్తూ అతనికి కట్టుబడి ఉన్నారు.”

సముద్రంలో

వారంతా ఈజిప్టును విడిచి మోషేతో ఎర్ర సముద్రం దాటారు.

మేఘంలో

ఇశ్రాయేలీయులను ఆ రోజుల్లో నడిపించిన మేఘం దేవునికి సూచనగా ఉంది.

ఆ బండ క్రీస్తే

“బండ” క్రీస్తు యొక్క స్థిరమైన బలాన్ని ఆయన ఆ ప్రయాణమంతా వారితో ఉండడాన్నీ సూచిస్తున్నది. వారు ఆయన భద్రత పైనా ఆదరణ పైనా ఆధారపడ్డారు. (చూడండి: రూపకాలంకారం).