Door43-Catalog_te_tn/1co/09/24.md

3.1 KiB

పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా?

ఇలా ఉండాలని అర్థం చేసుకోవాలి. (విడమర్చి చెప్పరు). దీనికి ప్రతిస్పందన దీనికి సంబంధించిన విషయం సరిగా అర్థం చేసుకోవాలి: “అవును పరిగెత్తేవారు చాలా మంది ఉన్నా ఒక్కడికే బహుమతి లభిస్తుంది.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

పరిగెత్తుతారు

పౌలు క్రైస్తవ జీవితాన్ని, దేవునికోసం పని చెయ్యడాన్ని ఒక క్రీడాకారునిగా పరుగు పందెంలో పాల్గొనడంతో పోలుస్తున్నాడు. పరుగు పందెంలో వలె క్రైస్తవుని జీవితం, పని కచ్చితమైన క్రమశిక్షణతో కూడి ఉండాలి. పరుగు పందెంలో వలె క్రైస్తవునికి నిర్దిష్టమైన గురి ఉండాలి. (చూడండి: రూపకాలంకారం).

బహుమానం పొందాలని

గెలవాలన్న నిబద్ధతతో పరిగెడితే ఆ ప్రయత్నాన్ని దేవుడు వారికి అప్పగించిన వాటిని చెయ్యడంతో పోల్చవచ్చు. (చూడండి: రూపకాలంకారం).

ఆకుల కిరీటం

ఒక పందెంలో గెలుపు, లేక పందెం పూర్తీ చేసిన దానికి గుర్తుగా అధికారులు ఆకులతో అల్లిన కిరీటం పెడతారు. ఈ పోలిక దేవుని పట్ల భక్తిభావంతో జీవించిన దాని ఫలితంగా శాశ్వత రక్షణను గుర్తుగా ఇస్తాడు (చూడండి: రూపకాలంకారం).

ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని

కర్త ప్రధాన వాక్య రీతిని కర్మ ప్రధాన పద్ధతిలోకి మార్చాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “ న్యాయాధికారి నా అర్హతను రద్దు చేస్తాడేమో.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).