Door43-Catalog_te_tn/1co/09/07.md

2.2 KiB

ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా?

ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక సైనికుడు తన సొంత డబ్బు ఖర్చు చేస్తూ సైన్యంలో పని చెయ్యడు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు?

ప్రత్యామ్నాయ అనువాదం: “ద్రాక్ష తోట నాటిన వాడు దాని పండ్లు తింటాడు గదా.” లేక “ద్రాక్ష తోట వేసిన వాడు దాని పండ్లు తినకూడదని ఎవరైనా అంటారా.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు??

ప్రత్యామ్నాయ అనువాదం: “ఆలమంద కాసే గొల్లవారు ఆ మంద పలు తాగుతారు గదా.” లేక “పశువులు కాసేవారు దాని పాలు తాగకూడదని ఎవరూ అనరు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా?

ప్రత్యామ్నాయ అనువాదం: “మానవ పద్ధతులను బట్టి నేను ఈ మాటలు చెప్పడం లేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా?

ప్రత్యామ్నాయ అనువాదం: “ధర్మశాస్త్రంలో రాసి ఉన్నది ఇదే.” (చూడండి: అలంకారిక ప్రశ్న).