Door43-Catalog_te_tn/1co/09/03.md

1.9 KiB

తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా?

ప్రత్యామ్నాయ అనువాదం: “సంఘాల నుంచి అన్నపానాలు పుచ్చుకోవడానికి మాకు పూర్తి హక్కు ఉంది.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మాకు

అంటే పౌలు, బర్నబా (చూడండి: విశేషాత్మక).

మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా?

ప్రత్యామ్నాయ అనువాదం: “మాకు విశ్వాసి అయిన భార్య ఉంటే వారిని మాతో తీసుకు వెళ్ళే హక్కు మాకు ఉంది. ఎందుకంటే మిగతా అపోస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా తదితరుల విషయంలో అదే జరుగుతున్నది గదా.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?

ప్రత్యామ్నాయ అనువాదం: “పని చెయ్యకుండా ఉండే హక్కు నాకు, బర్నబాకు కూడా ఉంది.” లేక “కానీ నేను, బర్నబా డబ్బు సంపాదించ డానికి పని చేసేలా మీరు చేస్తున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న).