Door43-Catalog_te_tn/1co/07/10.md

1.2 KiB

పెళ్ళయిన

జీవిత భాగస్వామి ఉన్న (భర్త లేక భార్య).

వేరు కాకూడదు

గ్రీకు వారు సాధారణంగా చట్టపరంగా విడాకులు తీసుకోడానికి, మాములుగా వేరై పోవడానికి తేడా గుర్తించరు; “వేరై పోవడం” అంటే వారి దృష్టిలో వివాహం రద్దు అయింది అని.

విడిచిపెట్టకూడదు

దీనికి “వేరై పోకూడదు” అని అర్థం. పై నోట్ చూడండి. అది చట్టపరంగా విడాకులు తీసుకోవడం, మాములుగా వేరై పోవడం కావచ్చు.

సమాధానపడాలి

“ఆమె తన భర్తతో తనకున్న సమస్యలు చక్కబెట్టుకుని అతని దగ్గరకు తిరిగి రావాలి.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).