Door43-Catalog_te_tn/1co/06/19.md

1.6 KiB

మీకు తెలియదా

“మీకు ముందే తెలుసు.” వారికి ఇది ముందే తెలుసని పౌలు నొక్కి చెబుతున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మీ శరీరం

ప్రతి క్రైస్తవుని శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం.

పరిశుద్ధాత్మకు ఆలయమనీ

ఆలయం దేవుడికి ప్రతిష్ట అవుతుంది. ఆయన దానిలో నివసిస్తాడు. అదే విధంగా కొరింతు విశ్వాసి శరీరం కూడా ఆలయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ అందులో ఉన్నాడు. (చూడండి: రూపకాలంకారం).

మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు

దేవుడు కొరింతీయులు పాప బానిసత్వం నుండి స్వేచ్చ పొందేలా వెల చెల్లించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మీ స్వేచ్చకై ఖరీదు చెల్లించాడు.”

కాబట్టి

ప్రత్యామ్నాయ అనువాదం: “కనుక” లేక “ఇది సత్యం కాబట్టి” లేక “ఈ వాస్తవాన్ని బట్టి.”